బిజీ బిజీగా చైతూ.. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే?

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన కెరియర్ పై దృష్టి సారించి ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

 Akkineni Naga Chaitanya Busy With Upcoming Projects Details,  Naga Chaitanya, To-TeluguStop.com

ఈ సినిమా విజయంలో ఫుల్ జోష్ మీద ఉన్నటువంటి నాగచైతన్య సమంతకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆ విషయం గురించి మరిచిపోయి పూర్తి తన దృష్టి మొత్తం సినిమాలపై పెట్టినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వరుస సినిమాలను చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం నాగచైతన్య చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే.నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నారు.ఇందులో నాగచైతన్య ఒక హాకీ ప్లేయర్ గా కనిపించనున్నట్లు సమాచారం.ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఈ సినిమా మాత్రమే కాకుండా బంగార్రాజు చిత్రంలో నాగార్జునతో కలిసి చైతన్య సందడి చేయనున్నారు.

Telugu Bangarraju, Horror Web, Naga Chaitanya, Projects, Thankyou, Tollywood-Mov

విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో థాంక్యూ చిత్రం పూర్తి కాకుండానే నాగచైతన్య విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఒక హారర్ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు సమాచారం.ఇందులో నాగచైతన్య నెగిటివ్ పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక కేవలం తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్నటువంటి లాల్ సింగ్ చద్దా సినిమా ద్వారా చైతన్య ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.ఇలా వరుస సినిమాలతో నాగచైతన్య ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube