39 ఏళ్లుగా విడుదలకు నోచుకోని అక్కినేని సినిమా..అలుపెరగని నిర్మాత పోరాటం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, నాగేశ్వరావు లాంటివారు ఒకప్పుడు అగ్ర హీరోగా వెలుగొంది ఇండస్ట్రీకి రెండు కళ్లుగా గుర్తింపు పొందారు.అయితే ఒకప్పుడు వీళ్లిద్దరి మధ్య సినిమాల పరంగా మంచి పోటీ ఉండేది ఈ ఇద్దరి సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద పోటీపడి మంచి విజయాన్ని సంపాదించుకునేవి.

 Akkineni Nageswara Rao Movie Which Was Released After 39 Years , Akkineni Nagesw-TeluguStop.com

అయితే ఎన్టీఆర్ ఎక్కువగా మైథలాజికల్ సినిమాలు చేసేవారు.నాగేశ్వరరావు ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు చేస్తూ జానపద చిత్రాల్లో నటించే వారు ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధం ఉండేది.

ఇదిలా ఉంటే నాగేశ్వరరావు టాప్ హీరో గా ఉన్నప్పుడు చేసిన ప్రతిబింబాలు అనే సినిమా ఇప్పటికీ ఇంకా రిలీజ్ కాలేదు ఈ సినిమాలో నాగేశ్వరరావు కు జోడీగా జయసుధ నటించారు.ఈ సినిమా ప్రొడ్యూసర్ జాగర్లమూడి రాధాకృష్ణ గారు ప్రస్తుతం ఈ సినిమాని రిలీజ్ చేయడానికి చూస్తున్నారు.

అప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనుకుంటున్నారా ఆ స్టోరి ఏంటో ఇప్పుడు చూద్దాం…

తెలుగు సినిమా నిర్మాత అయిన జాగర్లమూడి రాధాకృష్ణ గారు నాగేశ్వరరావుగారి డేట్స్ తీసుకొని ఒక సినిమాని స్టార్ట్ చేశారు ఆ సినిమానే ప్రతిబింబాలు.అయితే జాగర్లమూడి రాధాకృష్ణ గారితో అప్పటికే డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దొరస్వామిరాజు, హరికృష్ణ ఇద్దరు కలిసి మేము కూడా ఈ సినిమాలో ప్రొడ్యూస్ చేస్తాం అని చెప్పి మొదటి షెడ్యూల్ కి మీరు డబ్బులు అరెంజ్ చేయండి తర్వాత మేము డబ్బులు తీసుకొస్తాం అని రాధాకృష్ణ గారితో చెప్పారు దానికి ఒప్పుకున్న రాధాకృష్ణ ముందు ఒక షెడ్యూల్ కి తను డబ్బులు అరేంజ్ చేశాడు ఆ తర్వాత దొరస్వామిరాజు, హరికృష్ణ గారిని డబ్బులు తీసుకురా అని అడిగితే ప్రస్తుతానికి మేము డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఎక్కువ సినిమాలు ఒప్పుకున్న కాబట్టి మేము డబ్బులు తీసుకురాలేము మీరే సినిమా తీసేయండి అని చెప్పడంతో ప్రస్తుతం ఆయన దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలో తెలియక సినిమా కొన్ని రోజులపాటు ఆగిపోయింది.

రాధాకృష్ణ వాళ్ల దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు ఫైనాన్సు తీసుకొని వచ్చి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి షూట్ చేశారు మళ్ళీ కొన్ని రోజులకి ఇబ్బంది రావడంతో ఏం చేయాలో తెలియలేదు దాంతో ఒక సంవత్సరంపాటు సినిమా ఆగిపోయింది ఈ లోపు ఈ సినిమా దర్శకుడు వేరే సినిమాకి కమిట్ అవ్వడంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నాడు రాధాకృష్ణ.అప్పుడే నాగేశ్వరరావు గారికి హార్ట్ ఎటాక్ వచ్చి అమెరికా వెళ్లి ఒక సంవత్సరం పాటు అక్కడే ఉన్నారు.

Telugu Dora Swami Raju, Hari Krishna, Jayasudha, Prathibimbaalu, Pratibimbalu-Te

నాగేశ్వరరావు వచ్చిన తర్వాత ఆయన డేట్స్ తీసుకొని జయసుధ గారిని డేట్స్ అడిగితే ఆవిడ రెండు నెలల వరకు తన డేట్స్ ఖాళీ లేవని రెండు నెలల తర్వాత ఇస్తాను అని చెప్పింది దాంతో 2 నెలలు ఆగి షూట్ చేద్దాం అనుకున్నారు.ఈలోపు డైరెక్టర్ వేరే సినిమా కి వెళ్లిపోయాడని నాగేశ్వరరావుతో రాధాకృష్ణ చెప్పడంతో ప్రకాశ్ రావు గారిని తీసుకొచ్చి మిగిలిన భాగం షూట్ చేద్దాం అని నాగేశ్వరరావు చెప్పారు దాంతో రాధాకృష్ణ ప్రకాష్ రావు గారిని కలిసి సినిమా గురించి చెప్పి నాగేశ్వరరావు తో ఫోన్ చేయించడంతో ఆయన వచ్చి షూట్ చేయడం స్టార్ట్ చేశాడు.అయితే ప్రకాష్ రావు సినిమా లో ఉన్న నాలుగైదు సీన్లు మార్చడంతో సినిమా వేరేగా వస్తుంది అని గమనించిన రాధాకృష్ణ నాగేశ్వరరావుతో చెప్పాడు దాంతో నాగేశ్వరరావు ప్రకాష్ రావు తో అది ఎలా ఉందో అలాగే తీయండి అని చెప్పడంతో ప్రకాష్ రావు హాట్ అయి నేను తీయలేరు అని రాధాకృష్ణ తో చెప్పి వెళ్ళిపోయాడు.

దాంతో ఒక తమిళ యువ దర్శకుడిని తీసుకొచ్చి రాధాకృష్ణ సినిమా మొత్తాన్ని షూట్ చేశాడు దాంతో సినిమా పూర్తయింది కానీ రీరికార్డింగ్ చేయించడానికి రాధాకృష్ణ దగ్గర డబ్బులు లేవు రీరికార్డింగ్ చేయాలంటే 2 లక్షలు అడిగారు దాంతో ఆయన మళ్లీ ఒక సంవత్సరంపాటు సినిమాని ఆపి ఒక వ్యక్తి సహకారంతో డబ్బులు ఇవ్వడంతో ఈ సినిమా రికార్డింగ్ కూడా పూర్తి చేసుకుంది.

అయితే ప్రస్తుతం ఆ సినిమాని రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్ అయిన జాగర్లమూడి రాధాకృష్ణ గారు ప్రయత్నం చేస్తున్నారు మే లో సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది.ఎప్పుడో షూటింగ్ పూర్తయిన ఈ సినిమా 39 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేయడం అనేది ఇది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన విషయమే అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube