ఈ ఏడాది అక్కినేని హీరోలు సత్తా చాటేనా?

అక్కినేని నట వారసులుగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టారు నాగ చైతన్య, అఖిల్. వీరితో పాటు నాగార్జున కూడా ప్రస్తుతం వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు.

 Akkineni Heros Full Swing In 2022 Nagarjuna Akhil Naga Chaitanya Details, Akkineni Heroes, Akkineni Nagarjuna, Naga Chaitanya, Akhil, Bangarraju, The Ghost, Thank You, Agent, Akkineni Heroes Movies, Tollywood, Laal Singh Chadda-TeluguStop.com

ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా హిట్ సినిమాలతో ముందుకు సాగుతున్నారు.నాగ చైతన్య మజిలీ, లవ్ స్టోరీ, వెంకీమామ, బంగార్రాజు లాంటి సినిమాలతో హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు.

అటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో తొలి సక్సెస్ అందుకున్నాడు అఖిల్.అటు నాగార్జున సైతం సోగ్గాడే చిన్ని నాయన సినిమా తర్వాత బంగార్రాజు సినిమాతో మళ్లీ విజయాన్ని అందుకున్నాడు.

 Akkineni Heros Full Swing In 2022 Nagarjuna Akhil Naga Chaitanya Details, Akkineni Heroes, Akkineni Nagarjuna, Naga Chaitanya, Akhil, Bangarraju, The Ghost, Thank You, Agent, Akkineni Heroes Movies, Tollywood, Laal Singh Chadda-ఈ ఏడాది అక్కినేని హీరోలు సత్తా చాటేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొత్తంగా అక్కినేని కాంపౌండ్ హీరోలంతా సక్సెస్ ట్రాక్ లో కొనసాగుతున్నారు.

అటు ఈ ఏడాది కూడా ఈ ముగ్గురు హీరోలు సందడి చేయబోతున్నారు.

అక్కినేని హీరోలు ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు.గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది ఘోస్ట్ సినిమాతో నాగ్ జనాల ముందుకు రానున్నాడు.

మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా రూపొందుతుంది.ఈ సినిమాలో నాగ చైతన్య నటిస్తున్నాడు.

అటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా తెరెక్కుతోంది.ఇందులో అఖిల్ నటిస్తున్నాడు.

ఈ సినిమా కూడా ఈ ఏడాదిలో విడుదల కానుంది.

మొత్తంగా ఈ ముగ్గురు హీరోలు నటించిన సినిమాలు ఈ ఏడాది చివరల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.అయితే ఎవరు మంచి సక్సెస్ అందుకుంటారో తెలుసుకోవాలంటే మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

అటు నాగ చైతన్య బాలీవుడ్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడు.అమీర్ ఖాన్ నటించిన సినిమా లాల్ సింగ్ చద్దాలో చైతు కీలక పాత్ర పోషించాడు.అటు బ్రహ్మాస్త పార్ట్-1 అనే సినిమాలో అక్కినేని నాగార్జున నటిస్తున్నాడు.

ఈయన ఈ సినిమాలో కీరోల్ ప్లే చేశాడు.ఏప్రిల్ 14న లాల్ సింగ్ చద్ధా జనాల ముందుకు రాబోతుంది.

అటు సెప్టెంబర్ 9న బ్రహ్మాస్త విడుదల కానుంది.

Akkineni Heros Full Swing In 2022 Nagarjuna Akhil Naga Chaitanya Details, Akkineni Heroes, Akkineni Nagarjuna, Naga Chaitanya, Akhil, Bangarraju, The Ghost, Thank You, Agent, Akkineni Heroes Movies, Tollywood, Laal Singh Chadda - Telugu Akhil, Akkineni Heroes, Akkineni Heros, Bangarraju, Naga Chaitanya, Ghost, Tollywood #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube