మేర్లపాక గాంధీకి ఛాన్స్ ఇచ్చిన నాగచైతన్య  

Akkineni Hero Next Movie With Merlapaka Gandhi-merlapaka Gandhi,new Project,telugu Cinema,tollywood

అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇప్పుడు హీరోయిన్ సమంత మంచి జోష్ మీద ఉంది. వరుస హిట్స్ తో తన రేంజ్ ని పెంచుకుంటూ కమర్షియల్ హీరోయిన్ నుంచి కంటెంట్ హీరోయిన్ గా మారుతుంది. తాజాగా ఓ బేబీ సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా ఏకంగా కుర్ర హీరోలకి సాధ్యం కాని విధంగా రెండు వారాలలో 25 కోట్లకి పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో సక్సెస్ లో కంటెంట్ ఒక ఎత్తైతే సమంత కష్టం మరొక ఎత్తు..

మేర్లపాక గాంధీకి ఛాన్స్ ఇచ్చిన నాగచైతన్య -Akkineni Hero Next Movie With Merlapaka Gandhi

దీంతో ఈ భామ ఇప్పుడు వరుసగా కంటెంట్ బేస్డ్ సినిమాలతో లేడీ సూపర్ స్టార్ గా మారిపోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉంటే అక్కినేని హీరోలు మాత్రం ఎప్పటిలాగే డౌన్ ఫాల్ తో నడుస్తున్నారు.

మంతని పెళ్లి చేసుకున్న తర్వాత చైతు కెరియర్ డౌన్ అయితే సమంత కెరియర్ మాత్రం పీక్ లోకి వెళ్ళిపోయింది.

ఇక వరుస సినిమాలు చేస్తున్న సాలిడ్ హిట్ తన ఖాతాలో పడటం లేదు. చివరిగా సమంతతో జత కట్టి చేసిన మజిలీ సినిమా సూపర్ సక్సెస్ అయ్యి కిక్ ఇచ్చిన అందులో క్రెడిట్ ఎక్కువగా సమంత తీసుకుంది. ఈ నేపధ్యంలో మరో సూపర్ హిట్ అది కూడా కమర్షియల్ ఎంటర్టైనర్ ని తన ఖాతాలో వేసుకోవాలని నాగ చైతన్య కసితో ఉన్నాడు.

దాని కోసం ఇప్పుడు కమర్షియల్ చిత్రాలతో వరుసగా రెండు హిట్స్ కొట్టిన మేర్లపాక గాంధీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ దర్శకుడు చివరి చిత్రం ఫ్లాప్ అయిన కూడా అతని మేకింగ్ మీద నమ్మకంతో ఒప్పుకున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించడానికి ముందుకొచ్చింది.

ఇదిలా ఉంటే మరో వైపు చైతు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవితో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. అది ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.