ఎన్టీఆర్ పేరు పెట్టారు ఏఎన్నార్ పేరు పెడతారా.. అక్కినేని ఫ్యాన్స్ కోరిక ఇదే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్న సంగతి తెలిసిందే.సీఎం జగన్ ఒక జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడంతో ఏఎన్నార్ అభిమానులు ఏఎన్నార్ పేరు కూడా ఒక జిల్లాకు పెట్టాలని డిమాండ్ ను తెరపేకి తెస్తున్నారు.

 Akkineni Fans Demand About Anr District Name Details, Akkineni Fans,anr, Ap New Districts, Cm Jagan, Nagarjuna, Ntr, Akkineni Nageswara Rao, Sarveshwara Rao, Anr District Name,-TeluguStop.com

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి.ఏఎన్నార్ ఫ్యాన్స్ మచిలీపట్నం జిల్లాకు ఏఎన్నార్ పేరును పెట్టాలని కోరుకుంటున్నారు.

అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడు అయిన సర్వేశ్వరరావు తమ కోరికను ఏపీ సర్కార్ గౌరవించాలని కోరారు.ఏఎన్నార్ వందల సంఖ్యలో తెలుగు సినిమాలలో నటించి ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు.

 Akkineni Fans Demand About Anr District Name Details, Akkineni Fans,anr, Ap New Districts, Cm Jagan, Nagarjuna, Ntr, Akkineni Nageswara Rao, Sarveshwara Rao, Anr District Name, -ఎన్టీఆర్ పేరు పెట్టారు ఏఎన్నార్ పేరు పెడతారా.. అక్కినేని ఫ్యాన్స్ కోరిక ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కృష్ణా జిల్లాలోని గుడివాడ రామాపురంలో ఏఎన్నార్ జన్మించారు.తన సినీ కెరీర్ లో ఏఎన్నార్ ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ఆ పాత్రల ద్వారా విజయాలను సొంతం చేసుకున్నారు.

సినిమా రంగానికి ఏఎన్నార్ చేసిన సేవలకు ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కింది.

Telugu Akkineini Fans, Akkineni Fans, Anr, Ap Districts, Cm Jagan, Nagarjuna, Demand, Sarveshwara Rao-Movie

మచిలీపట్నం జిల్లాకు ఏఎన్నార్ పేరు పెడితే వ్యతిరేకించే వాళ్లు కూడా ఎవరూ ఉండరు.సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఏఎన్నార్ ను కోరినా ఏఎన్నార్ మాత్రం ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించడం గమనార్హం.సినిమా రంగం హైదరాబాద్ కు రావడంలో ఏఎన్నార్ కృషి ఎంతో ఉంది.

Telugu Akkineini Fans, Akkineni Fans, Anr, Ap Districts, Cm Jagan, Nagarjuna, Demand, Sarveshwara Rao-Movie

అభిమానుల నుంచి వ్యక్తమవుతున్న ఈ డిమాండ్ విషయంలో ఏపీ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.ఏపీలో 26 జిల్లాలు, మూడు రాజధానుల నుంచి పరిపాలన మొదలు కానుందని సమాచారం.ఏఎన్నార్ కళారంగానికి సేవలు చేసిన నేపథ్యంలో జగన్ సర్కార్ ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది.నాగార్జున ఏపీ సీఎం జగన్ కు సన్నిహితుడు అనే సంగతి తెలిసిందే.

భవిష్యత్తులో ఈ ప్రతిపాదన దిశగా అడుగులు పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube