అక్కినేని విందుకు హాజరైన అమీర్ ఖాన్.. ఫోటో వైరల్!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ. టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా నిన్న విడుదల అయ్యింది.

 Akkineni Family Celebration With Aamir Khan Photo Viral-TeluguStop.com

మళ్ళీ చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లో థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తుంది.మంచి ఫీల్ తో ప్రేమ కథను తెరకెక్కించి మరొక సారి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు శేఖర్ కమ్ముల.

Telugu Aamir Khan, Akkineni Family Celebration With Aamir Khan Photo Viral, Love Story Movie, Naga Chaitanya, Sai Pallavi, Shekar Kammula, Social Media, Viral Photo-Movie

లవ్ స్టోరీ సినిమా విడుదల అయినా మొదటిరోజు మంచి వసూళ్లను సాధించింది.కరోనా తర్వాత విడుదల అవవడంతో ఈ సినిమా ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ సినిమాకు ముందు నుండి అంచనాలు ఉండడంతో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించిందని చెప్పాలి.కరోనా తర్వాత ఈ సినిమాకు మాత్రమే ముందుగానే టికెట్స్ బుకింగ్స్ కూడా జరిగాయి.

 Akkineni Family Celebration With Aamir Khan Photo Viral-అక్కినేని విందుకు హాజరైన అమీర్ ఖాన్.. ఫోటో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే చిత్ర యూనిట్ పార్టీ చేసుకుంది.ఈ పార్టీలో అక్కినేని ఫ్యామిలీ తో పాటు అమీర్ ఖాన్ కూడా పాల్గొన్నాడు.

ప్రెసెంట్ అమీర్ ఖాన్ తో కలిసి నాగ చైతన్య లాల్ సింగ్ చద్దా లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ లో భాగంగా నాగ చైతన్య అమీర్ ఖాన్ తో కలిసి నటించాడు.

దీంతో ఆ సమయంలో నాగ చైతన్య ప్రవర్తనకు అమీర్ ఖాన్ ఫిదా అయ్యాడట.

అందుకే అమీర్ ఖాన్ లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యాడు.

ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత అమీర్ ఖాన్ కు అక్కినేని కుటుంబం విందును ఏర్పాటు చేసింది.ఈ పార్టీలో అక్కినేని నాగార్జున, అఖిల్, నాగ చైతన్య తో పాటు, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది.

ఇక రిలీజ్ కు ముందే చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.

Telugu Aamir Khan, Akkineni Family Celebration With Aamir Khan Photo Viral, Love Story Movie, Naga Chaitanya, Sai Pallavi, Shekar Kammula, Social Media, Viral Photo-Movie

ఇక ఈ పార్టీలో సమంత కనిపించక పోవడంతో మళ్ళీ గుసగుసలు మొదలయ్యాయి.ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ పార్టీకి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఫొటోలో నాగ చైతన్య, అఖిల్, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి, నాగార్జునతో పాటు అమీర్ ఖాన్ కూడా కేక్ కట్ చేస్తూ కనిపించరు.

మొత్తానికి అక్కినేని కుటుంబం రూమర్స్ అన్ని పక్కన పెట్టి మరి సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు.

#Sai Pallavi #Love Story #Aamir Khan #Shekar Kammula #Naga Chaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు