సంక్రాంతి నుంచి తప్పుకున్న అక్కినేని బ్రదర్స్!

ప్రతి సంవత్సరం ఏవైనా పండుగలు వస్తున్నాయంటే థియేటర్ల ముందర నిజంగానే పండుగ వాతావరణం ఏర్పడేది.స్టార్ హీరోల సినిమాలన్నీ పండుగ బరిలో దిగిన నువ్వా,నేనా అన్నట్లు పడి థియేటర్ల ముందు సందడి చేసేవి.

 Love Story And Most Eligible Bachelor Movies Out From Sankranthi Race, Love Stor-TeluguStop.com

ఈ సంవత్సరం సంక్రాంతికి కూడా అలా వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాలు థియేటర్ల ముందర సందడి చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి.సంక్రాంతి తర్వాత కరోనా విజృంభించడంతో సినిమా షూటింగు లతోపాటు, సినిమా థియేటర్లను కూడా మూసివేశారు.

అన్ లాక్ ప్రక్రియ తర్వాత సినిమా షూటింగ్ లకు అనుమతి లభించి చిత్ర నిర్మాణాలు జరుపుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ప్రభుత్వాల నుంచి థియేటర్లకు అనుమతి లభించినప్పటికీ ప్రేక్షకులు సినిమా చూడటానికి థియేటర్లకు వస్తారా? లేదా ?అన్న అనుమానాలు తలెత్తేడంతో నిర్మాతలు సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు.కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలంటే బోలెడంత నష్టం వాటిల్లుతుందని భావించి నిర్మాతలు పలు సినిమాలను సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు.ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి వాటిలో విడుదలయి మంచి ప్రేక్షకాదరణ పొందాయి.

Telugu Akhil, Akkineni Akhil, Corona Effect, Love Story, Lovestory, Naga Chaitan

అయితే ఈ ఏడాది సంక్రాంతి బరిలో అక్కినేని అన్నదమ్ములు నటించిన సినిమాలు థియేటర్లలో విడుదల చేయాలని భావించారు.సంక్రాంతికి నాగచైతన్య నటించిన “లవ్ స్టోరీ” విడుదల చేయాల్సి ఉండగా, ఈ సినిమాను వేసవికి వాయిదా వేసినట్లు తెలిపారు.అంతేకాకుండా అఖిల్ నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయకుండా వాయిదా వేయాలనే ఆలోచనలో నిర్మాత అల్లు అరవింద్ ఉన్నట్లు సమాచారం.మొత్తానికి సంక్రాంతి బరిలో ఉండాల్సిన అక్కినేని బ్రదర్స్ కరోనా కారణం వల్ల సంక్రాంతి పండుగ నుంచి తప్పుకున్నారనే సమాచారం వినిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube