లవ్‌స్టోరితో పోటీపడుతున్న బ్యాచ్‌లర్  

Akkineni Brothers Clash At Box Office - Telugu Akkineni Akhil, Akkineni Naga Chaitanya, Love Story, Most Eligible Bachelor, Telugu Movie News

అక్కినేని వారసులుగా అక్కినేని నాగచైతన్య ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.కాగా అక్కినేని అఖిల్ మాత్రం ఇంకా తొలి హిట్ కొట్టేందుకు ఆసక్తిగా చూస్తున్నాడు.

Akkineni Brothers Clash At Box Office

అతడు నటించిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేయడంతో ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమా టైటిల్‌తో మనముందుకు రానున్నాడు.

అయితే ఈసారి హిట్ కొట్టేందుకు సొంత అన్నతో కూడా పోటీకి సై అంటున్నాడు.

లవ్‌స్టోరితో పోటీపడుతున్న బ్యాచ్‌లర్-Gossips-Telugu Tollywood Photo Image

అటు నాగచైతన్య తాజాగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ లవ్ స్టోరి రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాను ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మార్చి 29న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా అదే సమయంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని కూడా రిలీజ్ చేసేందుకు అఖిల్ అండ్ టీమ్ రెడీ అవుతోంది.

ఇక అన్నదమ్ములు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటంతో అక్కినేని బ్రదర్స్‌లో ఎవరు గెలుస్తారా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద ఈ పోటీతో అక్కినేని ఫ్యాన్స్‌లో సందడి నెలకొనడం ఖాయమని అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test