రెండు రోజుల్లో 36 కోట్లు.. ఇది బంగార్రాజు హవా..!

కింగ్ నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వచ్చిన సినిమా బంగార్రాజు.అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ కలిసి నిర్మించిన బంగార్రాజు సినిమా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వల్ గా వచ్చింది.

 Akkineni Bangarraju Two Days Collections Bangarraju , Nagarjuna, Nagachaitanya ,-TeluguStop.com

ఆ సినిమా ఎక్కడ ఆగుతుందో అక్కడి నుండి  ఈ సినిమా మొదలవుతుంది.ఈ సంక్రాంతికి సూపర్ ఎంటర్టైనర్ గా బంగార్రాజు నిలిచాడు.మొదటి రోజు 17.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా రెండో రోజు కూడా అదే దూకుడు చూపించింది బంగార్రాజు.ఏపీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నా సరే ఏపీ, తెలంగాణాలో వసూళ్లు అదరగొట్టయి.

బంగార్రాజు వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో 36 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని అంటున్నారు.అంటే దాదాపు 18.8 కోట్ల దాకా షేర్ రాబట్టింది అన్నమాట.బంగార్రాజుతో నాగార్జున సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు.నాగార్జున, నాగ చైతన్య ఇద్దరు తమ నటనతో సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనింగ్ సినిమా అందించారు.అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.కృతి శెట్టి హీరోయిన్ గా మెప్పించింది.

జస్ట్ వారం ముందు సంక్రాంతికి వస్తున్నామని ప్రకటించి  సినిమా హిట్ అందుకున్నాడు నాగార్జున.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube