కోడలికి అక్కినేని అమల చాలెంజ్! ఒప్పుకొని తీరాల్సిందే  

అక్కినేని అమల రీడింగ ఈజ్ ఎ బుక్ చాలెంజ్ .

Akkineni Amala Nominate To Samantha And Upasana For Reading Is A Good Challenge-reading Is A Good Challenge,social Media Challenge,telugu Cinema,tollywood

సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చాలెంజ్ లు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఈ చాలెంజ్ లలో కొన్ని ఇంటరెస్టింగ్ గా సమాజానికి స్ఫూర్తి ఇచ్చే విధంగా ఉంటే మరికొన్ని మాత్రం చాలా క్రేజీగా ఉంటున్నాయి. సెలబ్రిటీలు ఎక్కువగా ఈ రకమైన చాలెంజ్ లు చేయడం, ఎవరో చేసిన చాలెంజ్ ని ఒప్పుకొని దానిని సోషల్ మీడియాలో షేర్ చేసి మరో ఇద్దరికి చాలెంజ్ విసరడం చేస్తూ ఉన్నారు..

కోడలికి అక్కినేని అమల చాలెంజ్! ఒప్పుకొని తీరాల్సిందే-Akkineni Amala Nominate To Samantha And Upasana For Reading Is A Good Challenge

సెలబ్రిటీలని ఫాలో అయ్యే అందరూ ఈ రకమైన చాలెంజ్ లలో తాము కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అక్కినేని అమల సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చాలెంజ్ ని స్వీకరించింది. రామ్ ప్రసాద్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో అమలకి రీడింగ్ ఈజ్ ఎ గుడ్ చాలెంజ్ ని విసిరాడు.

అతని చాలెంజ్ నచ్చిన అమల తాను కూడా పది మందికి స్పూర్తిగా నిలవాలని ఒక బుక్ చదువుతున్నట్లు సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేస్తూ మెగాస్టార్ కోడలు ఉపాసనకి, అలాగే తన కోడలు సమంతకి రీడింగ్ ఈజ్ ఎ గుడ్ చాలెంజ్ కి నామినేట్ చేస్తున్నట్లు పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా. అమల చాలెంజ్ ని ఉపాసన, సమంత స్వీకరించినట్లు తెలుస్తుంది.

మరి ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ గా మారుతున్న రీడింగ్ ఈజ్ ఎ గుడ్ చాలెంజ్ ని ఎంత మంది ఫాలో అవుతారో చూడాలి.