అమ్మో అమల అక్కినేని మేడం, నువ్వు గ్రేట్‌  

Akkineni Amala Lifted 71 Kg Weight-amala Fitness Video,amala Lifted 71 Kg,viral In Social Media

అక్కినేని ఇంటి కోడలు అమల.నాగార్జున భార్యగా కాకుండా ముందే ఒక హీరోయిన్‌గా తెలుగు వారికి ఈమె సుపరిచితురాలు అయ్యింది.హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన అమలా ఆ తర్వాత నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకుంది.అక్కినేని వారి ఇంటి కోడలు అయిన తర్వాత అమల సినిమాలకు గుడ్‌ బై చెప్పింది.బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌ ఇలా అన్ని వుడ్స్‌కు ఈమె గుడ్‌ బై చెప్పింది.

Akkineni Amala Lifted 71 Kg Weight-amala Fitness Video,amala Lifted 71 Kg,viral In Social Media Telugu Tollywood Movie Cinema Film Latest News-Akkineni Amala Lifted 71 Kg Weight-Amala Fitness Video Amala Viral In Social Media

మామూలుగా హీరోయిన్‌గా కొనసాగితేనే గ్లామర్‌ను ఫిజిక్‌ను మెయింటెన్‌ చేస్తారు.

Akkineni Amala Lifted 71 Kg Weight-amala Fitness Video,amala Lifted 71 Kg,viral In Social Media Telugu Tollywood Movie Cinema Film Latest News-Akkineni Amala Lifted 71 Kg Weight-Amala Fitness Video Amala Viral In Social Media

కాని అమల అక్కినేని మాత్రం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది.52 ఏళ్ల వయసు వచ్చినా కూడా అమల అక్కినేని మాత్రం ఇంకా మంచి ఫిజిక్‌తోనే కనిపిస్తున్నారు.ఆమె ఫిజిక్‌కు రహస్యం ఏంటో ఇప్పుడు తెలిసి పోయింది.ఆమె రెగ్యులర్‌గా జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తుంది.ఆమె జిమ్‌లో వర్కౌట్స్‌ చేయడం వల్లే ఇలా ఇప్పటికి యవ్వనంగా ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.జిమ్‌లో తాజాగా వర్కౌట్‌ చేస్తున్న వీడియోను అమలా అక్కినేని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

70 కేజీలకు పైగా బరువును అమల ఈజీగా ఎత్తింది.ఆడవారు బలవంతులు కారు అనేవారికి ఇదే సవాల్‌ అన్నట్లుగా ఆమె ఈ వీడియోను పోస్ట్‌ చేసింది.ఆడవారు మెంటల్‌గానే కాకుండా ఫిజికల్‌గా కూడా చాలా స్ట్రాంగ్‌ అంటూ దీంతో నిరూపితం అయ్యిందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

వెయిట్‌ లిఫ్టింగ్‌ చేసిన అమల అక్కినేనిపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.మేడం మీరు సూపర్‌ అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు.