అభిజిత్ అలాంటి వాడు.. నిజాలు చెప్పేసిన అక్కినేని అమల?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోలోని కంటెస్టెంట్లలో ఒకరైన అభిజిత్ గురించి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతోంది.చాలామంది సెలబ్రిటీలు అభిజిత్ కు సపోర్ట్ చేస్తూ ఉండటంతో అతడే విన్నర్ అవుతాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

 Akkineni Amala Interesting Comments About Bigg Boss Contestant Abhijeet, Abhijit-TeluguStop.com

అయితే నెటిజన్లు మాత్రం అభిజిత్ విన్నర్ అయ్యే అవకాశాలే లేవని.ఒకవేళ అభిజిత్ విన్నర్ అయితే మాత్రం బిగ్ బాస్ నిర్వాహకులు చేసిన పెద్ద బ్లండర్ అదే అవుతుందని అభిప్రాయపడుతున్నారు.

అయితే అభిజిత్ తో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించిన అక్కినేని అమల తాజాగా అభిజిత్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఆ సినిమాలో అభిజిత్ అమ్మగా అమల నటించగా బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

అయితే సినిమా ఫ్లాపైనా ఆ సినిమాకు టీవీలో ఇప్పటికీ మంచి టీఆర్పీ రేటింగ్ లు వస్తూ ఉంటాయి.ఆ సినిమాను అభిమానించే అభిమానులు కూడా ఎంతోమంది ఉన్నారు.

Telugu Abhijeet, Akkineni Amala, Bigg Boss Show, Beautiful-Latest News - Telugu

తాజాగా అమల అభిజిత్ గురించి మాట్లాడుతూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా షూటింగ్ సమయంలో అభిజిత్ చాలా చిన్నవాడని.ఇంజనీరింగ్ పూర్తైన తరువాత ఆ సినిమాలో నటించాడని.అభిజిత్ పెద్దలతో ఎంతో మర్యాదగా ఉంటూ అందరినీ అభిజిత్ మంచిగా చూసుకుంటాడని చెప్పారు.బిగ్ బాస్ లో అభిజిత్ చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తున్నాడని.అభిజిత్ తనకు కొడుకు లాంటి వాడని అన్నారు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా షూటింగ్ సమయంలో అమ్మ పాత్రలో నటిస్తున్న తనను అభిజిత్ అమ్మలానే చూసుకున్నాడని తెలిపారు.

అభిజిత్ కూడా తనలానే మూగజీవాలను ఎంతగానో ఇష్టపడతాడని తెలిపారు.అక్కినేని అమల అభిజిత్ కు మద్దతు ప్రకటించడంతో ఆ మద్దతు అతనికి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube