టబుతో నాగ్ కు ఎఫైర్ అంటూ ప్రచారం.. ఆ వార్తలపై అమల ఏమన్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అక్కినేని నాగార్జునకు మన్మథుడిగా పేరుంది.నాగ్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

 Akkineni Amala Clarity About Nag Tabu Affair Details, Akkineni Nagarjuna, Akkine-TeluguStop.com

మరికొన్ని రోజుల్లో నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.వచ్చే నెల 5వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.అయితే నాగార్జున గురించి గతంలో చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ప్రముఖ హీరోయిన్ టబుతో నాగార్జునకు ఎఫైర్ అంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.నాగార్జున, టబు కలిసి పలు సినిమాల్లో నటించడం ఆ సినిమాలు కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించడంతో ఈ తరహా వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే నాగార్జున, టబు ఈ వార్తలను పెద్దగా పట్టించుకోలేదు.అయితే తాజాగా అమల ఈ వార్తల గురించి స్పందించి తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు.ఒకే ఒక జీవితం సినిమాతో అమల ఖాతాలో సక్సెస్ చేరిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో నటించిన అమల ఆ పాత్ర ద్వారా ప్రశంసలు అందుకున్నారు.

Telugu Akkineni Amala, Tabu, Nagarjuna, Nagarjuna Tabu-Movie

నాగ్ టబు ఎఫైర్ గురించి మాట్లాడుతూ టబు నా భర్తకు, నాకు మంచి ఫ్రెండ్ అని ఆమె అన్నారు.నాగార్జున టబు మధ్య ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందని అంతకుమించి వాళ్లిద్దరి మధ్య ఏం లేదని అమల తెలిపారు.నేను సంతోషంగా ఉన్నానని మా కుటుంబంలో ఏదో జరుగుతోందని బాధ పడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.

Telugu Akkineni Amala, Tabu, Nagarjuna, Nagarjuna Tabu-Movie

మా ఇంట్లో సినిమాల గురించి చర్చ జరగదని కుటుంబ వ్యవహారాల గురించి మాత్రమే చర్చ జరుగుతుందని అమల కామెంట్లు చేశారు.మా ఇల్లు దేవాలయంలా పవిత్రంగా ఉంటుందని అమల చెప్పుకొచ్చారు.అమల వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

అమల క్లారిటీతో ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube