ఆ వార్తలు నిజం కాదంటున్న అక్కినేని అమల....

ప్రస్తుతం టాలీవుడ్ లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చిత్రాలకు సంబంధించినటువంటి షూటింగులను మరియు ఇతర పనులను కూడా నిలిపివేశారు.దీంతో సినీ పరిశ్రమకు చెందిన స్టార్లు మరియు ఆర్టిస్టులు అందరు కూడా తమ నివాసాలకే పరిమితమయ్యారు.

 Akkineni Amala, Akkineni Amala Pet Cross News, Green India Udyamam, Corona Virus-TeluguStop.com

అయితే ఇందులో భాగంగా కొందరు లాక్ డౌన్ కారణంగా ఆశ్రయం కోల్పోయి తిండీ తిప్పలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సహాయం చేసేందుకు ముందుకు రాగా, మరికొందరు మాత్రం ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సూచిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

అయితే తాజాగా కొందరు సోషల్ మీడియాలో జంతువుల ద్వారా కరోనా వైరస్ వస్తుందని తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు.

దీంతో ఈ వార్తలపై టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున భార్య అక్కినేని అమల స్పందించింది.ఇందులో భాగంగా జంతువుల ద్వారా కరోనా వైరస్ సొకదని తెలిపింది.అంతేగాక ఇప్పటి వరకు పెంపుడు జంతువులు నుంచి కరోనా వైరస్ సోకుతుందని ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు.కాబట్టి ఒకవేళ మీకు పెంపుడు జంతువుల గురించి ఎటువంటి అనుమానాలు ఉంటే దగ్గరలో ఉన్నటువంటి పెంపుడు జంతువులకు సంబంధించిన ఆసుపత్రులకు తీసుకు వెళ్లాలని సూచించారు.
 

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండేటువంటి అమల ప్రజలకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడమే గాక, వాటిని ఆచరించడంలో కూడా అమల ఎప్పుడూ ముందు ఉంటుంది.గతంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రీన్ ఇండియా ఉద్యమం లో కూడా పాల్గొని తన నివాసంలో మొక్కలు నాటింది.

అంతేగాక తనకు సన్నిహితులైన మరికొందరిని కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములను చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube