పిల్లల గురించి అక్కినేనికి ముందే తెలుసు.. అందుకే పెళ్లి అంటే అప్పట్లోనే ఆ మాట అన్నారట?

Akkineni Already Knew About The Children So Marriage Time They Said Like That

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం గురించి అందరికీ తెలిసిందే.తమ కుటుంబం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది.

 Akkineni Already Knew About The Children So Marriage Time They Said Like That-TeluguStop.com

అక్కినేని నాగేశ్వరరావు నుండి అక్కినేని అఖిల్ వరకు మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక ఈ కుటుంబం తమ వ్యక్తిగత విషయంలో చాలాసార్లు హాట్ టాపిక్ గా నిలిచింది.

గతంలో అక్కినేని నాగేశ్వర్ కుమారుడు నాగార్జున తన మొదటి వివాహం విడాకుల సమయంలో బాగా చర్చనీయాంశమైంది.ఆ తర్వాత తన మనవడు సుమంత్ కూడా తన పెళ్లి విషయంలో విడాకుల వరకు తెచ్చుకున్నాడు.

 Akkineni Already Knew About The Children So Marriage Time They Said Like That-పిల్లల గురించి అక్కినేనికి ముందే తెలుసు.. అందుకే పెళ్లి అంటే అప్పట్లోనే ఆ మాట అన్నారట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరిద్దరూ ఇండస్ట్రీకి పరిచయం ఉన్న వాళ్లనే పెళ్లి చేసుకున్నారు.కానీ తమ జీవితం ఎక్కువ రోజులు సాగకపోవడంతో నాగార్జున మరో సినీ నటి అమలను పెళ్లి చేసుకున్నాడు.

సుమంత్ మాత్రం ఇంకా ఒంటరిగానే ఉన్నాడు.

ఇక నాగార్జున వారసులైన నాగ చైతన్య, అఖిల్ గురించి అందరికీ పరిచయమే.

వీళ్లు నటులుగా స్టార్ హోదా కోసం బాగా పోరాడుతున్నారు.కానీ తమ నిజ జీవితంలో మాత్రం పోరాటం చేయలేకపోతున్నారు.

నాగార్జున తన ఇద్దరు కొడుకులకు ఒకేసారి పెళ్లి చేయాలని అనుకున్నాడు.దాంతో ఇద్దరికీ ఒకే రోజు ఎంగేజ్మెంట్ కూడా చేయగా ఎంగేజ్మెంట్ తర్వాత అఖిల్ ను ఆ అమ్మాయి కాదని వెళ్ళిపోయింది.

ఇక నాగచైతన్యకు మాత్రం కోరుకున్న విధంగా సమంత తో పెళ్లి జరిగింది.వీరి పెళ్లి జీవితం అద్భుతంగా సాగగా ఇటీవలే వీరు కూడా విడిపోతున్నామని ప్రకటించారు.దీంతో నాగచైతన్య మొదటి వివాహం కూడా బ్రేక్ అప్ అయ్యింది.అలా అక్కినేని కుటుంబంలో పెళ్లి జీవితం అనేది బాగా ఎమోషనల్ టచ్ లతోనే ఉన్నాయి.ఇక అక్కినేని నాగేశ్వరరావుకు పిల్లల గురించి ముందే తెలుసట.అందుకే పెళ్ళి గురించి అప్పట్లో ఓ మాట కూడా అన్నారట.

నాగేశ్వరరావు కుటుంబానికి ఎంతో పలుకుబడి ఉంది.దీంతో ఆయన పిల్లలను పెళ్లి చేసుకోవడానికి ఎంతోమంది ప్రముఖులు, సన్నిహితులు ఆయన దగ్గరికి వచ్చి పెళ్లి గురించి సంప్రదించేవారట.కానీ వారందరికీ నాగేశ్వరరావు సూటిగా సమాధానం చెప్పేవారట.తమతో వియ్యాన్ని కోరడం మాత్రం కోరారు కానీ తన ఫ్యామిలీతో వియ్యం అంటే అన్ని వివాహ బంధంలా ఉంటుందని అనుకోవద్దని వచ్చిన వారితో నేరుగా చెప్పేవారట నాగేశ్వరరావు.

Telugu Akhil Akkinani, Akkineni, Childrens, Marrige, Nagachaitanya, Nagaswara Rao, Samantha, Tollywood-Movie

తమతో సంబంధం కోరుకోవచ్చు కానీ వివాహ బంధం అనేది మాత్రం తమ పిల్లలు నుండి భరోసా ఇవ్వలేను అన్నట్లుగా చెప్పేవారట.దీన్నిబట్టి నాగేశ్వరరావుకు పిల్లల భవిష్యత్తు గురించి ముందే తెలుసేమో అందుకే తమ పిల్లల పెళ్లిళ్ల గురించి భరోసా ఇవ్వము అని గట్టిగా చెప్పాడని అర్థమవుతుంది.తాజాగా అక్కినేని వారసుల్లో మరో జంట కూడా వేరు అయినట్లు తెలిసింది.

దీనిని బట్టి అక్కినేని కుటుంబం నటన పరంగా తమ జీవితాన్ని సాగిస్తున్నారు కానీ తమ పెళ్ళి జీవితాన్ని మాత్రం సాధించటం లేదేమో అని తెలుస్తుంది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం సమంత, నాగ చైతన్య ల గురించే టాక్ నడుస్తుంది.

#Akkineni #Akhil Akkinani #Marrige #Samantha #Nagachaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube