హీరో అఖిల్ పెళ్లి ఫిక్స్.. పెళ్లికూతురు ఎవరంటే..?  

akkineni akhil to marry business man daughter, Akhil Akkineni, Samantha, Akkineni Family, Shreya Bhupal, Nagahchaitanya, Akkineni Akhil Marriage - Telugu @akhilakkineni8, Akhil Akkineni, Akkineni Akhil Marriage, Akkineni Family, Nagahchaitanya, Samantha, Shreya Bhupal

అక్కినేని నాగార్జున తనయుడు, హీరో అఖిల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోలేకపోయినా హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును మాత్రం తెచ్చుకున్నారు.సినిమాసినిమాకు నటనలో పరిణతి చూపిస్తూ హీరోగా అంతకంతకూ ఎదుగుతున్నారు.

TeluguStop.com - Akkineni Akhil To Marry Business Man Daughter

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన అఖిల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని.ఈ పెళ్లికి అక్కినేని సమంత పెళ్లిపెద్దగా వ్యవహరించనుందని తెలుస్తోంది.

ప్రముఖ బిజినెస్ మేన్ కూతురును అఖిల్ వివాహం చేసుకోబోతున్నాడని సమాచారం.త్వరలోనే అఖిల్ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివాళ్లయ్యారు.నిజానికి కొన్ని సంవత్సరాల క్రితమే అఖిల్ పెళ్లి జరగాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది.

TeluguStop.com - హీరో అఖిల్ పెళ్లి ఫిక్స్.. పెళ్లికూతురు ఎవరంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

శ్రేయాభూపాల్ అనే యువతిని ప్రేమించిన అఖిల్ కుటుంబ సభ్యులను కూడా పెళ్లికి ఒప్పించాడు. నాగచైతన్య సమంత వివాహం కంటే ముందే అఖిల్ శ్రేయాభూపాల్ మ్యారేజ్ ఫిక్స్ అయింది.

కానీ ఊహించని విధంగా అఖిల్ శ్రేయాభూపాల్ విడిపోగా శ్రేయా మరో వ్యక్తిని వివాహం చేసుకుంది.శ్రేయాతో విడిపోయిన అనంతరం అఖిల్ పూర్తిగా కెరీర్ పైనే దృష్టి పెట్టాడు.

ఆ తర్వాత అఖిల్ పెళ్లికి సంబంధించిన ఎలాంటి వార్తలు రాలేదు.

ఫిల్మ్ నగర్ వర్గాల్లో అఖిల్ మ్యారేజ్ ను సెట్ చేసింది సమంతనే అనే వార్త చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం సామ్ పెళ్లికూతురు కుటుంబ సభ్యులను ఒప్పించే పనిలో బిజీగా ఉందని సమాచారం.అయితే అఖిల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు.? ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో వాస్తవమెంత.? అనే విషయాలపై స్పష్టత రావాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.అఖిల్ కు త్వరలో పెళ్లి అని వార్తలు రావడంతో అక్కినేని అభిమానులు ఆనందపడుతున్నారు.

#@AkhilAkkineni8 #Samantha #Akhil Akkineni #AkkineniAkhil #Nagahchaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akkineni Akhil To Marry Business Man Daughter Related Telugu News,Photos/Pics,Images..