అఖిల్‌ 4 మూవీ గురించి ఆసక్తికర విషయం  

Akkineni Akhil Next Movie Updation-

అక్కినేని అఖిల్‌ నాల్గవ సినిమా మొదలైంది.బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఈ చిత్రం కాస్త అటు ఇటుగా ‘బొమ్మరిల్లు’ చిత్రం మాదిరిగా ఉండబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్నారు...

Akkineni Akhil Next Movie Updation--Akkineni Akhil Next Movie Updation-

ఈ చిత్రంలో అఖిల్‌ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా కనిపించబోతున్నాడు.ఒక సింపుల్‌ మిడిల్‌ క్లాస్‌ బాయ్‌గా అఖిల్‌ను బొమ్మరిల్లు భాస్కర్‌ చూపించబోతున్నాడు.

Akkineni Akhil Next Movie Updation--Akkineni Akhil Next Movie Updation-

బొమ్మరిల్లు చిత్రంతో పాటు భాస్కర్‌ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని చిత్రాల్లో కూడా హీరో ధనిక కుటుంబంకు చెందిన కుర్రాడిగా కనిపించాడు.అయితే ఈసారి మాత్రం చాలా విభిన్నంగా ప్లాన్‌ చేశాడు.

ఈ కథ విషయంలో మెగా నిర్మాత అల్లు అరవింద్‌ దాదాపు ఆరు నెలల పాటు చర్చలు జరిపి చివరకు ఓకే చెప్పడం జరిగింది.కథ మరియు స్క్రిప్ట్‌ పక్కాగా రెడీ అయిన తర్వాత సినిమా మొదలు పెట్టారు.ఈ చిత్రంలో హీరోయిన్‌ విషయంలో అధికారిక ప్రకటన రాలేదు..

చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం రష్మిక లేదా నభా నటేష్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇస్మార్ట్‌ శంకర్‌ ఫలితం తర్వాత నభా నటేష్‌ ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకుంటామని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.సినిమా కోసం అఖిల్‌ కొత్త లుక్‌ను ట్రై చేస్తున్నాడు.ఈ చిత్రంతో అయినా సక్సెస్‌ను దక్కించుకుంటాడో చూడాలి.