మైత్రి బ్యానర్ లో లవ్ స్టోరీ చేయబోతున్న అఖిల్ !

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకరు.ఈయన కు ఇప్పటి వరకు సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు.

 Akkineni Akhil Next Movie In Mythri Movie Makers-TeluguStop.com

నటన, డాన్స్ లో అదరగొడుతున్న ఎందుకో అఖిల్ కు కలిసిరావడం లేదు.తొందరపడకుండా నిదానంగా స్టోరీలను ఎంచుకుంటూ చేస్తున్న అఖిల్ కు మాత్రం సూపర్ హిట్ అయితే దక్కడం లేదు.

ప్రస్తుతం అఖిల్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

 Akkineni Akhil Next Movie In Mythri Movie Makers-మైత్రి బ్యానర్ లో లవ్ స్టోరీ చేయబోతున్న అఖిల్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Agent Movie, Akhil, Akkineni Akhil Next Movie In Mythri Movie Makers, Most Eligible Bachelor, Mythri Movie Makers, Pooja Hegdhe, Surender Reddy, Tollywood-Movie

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.

ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

ఇప్పటికే విడుదల అయినా పోస్టర్ లో అఖిల్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.అఖిల్ లోని మాస్ హీరోను బయటకు తీసి ప్రేక్షకులకు కొత్తగా చూపించేందుకు సురేందర్ రెడ్డి రెడీ అవుతున్నాడు.

Telugu Agent Movie, Akhil, Akkineni Akhil Next Movie In Mythri Movie Makers, Most Eligible Bachelor, Mythri Movie Makers, Pooja Hegdhe, Surender Reddy, Tollywood-Movie

తాజాగా అఖిల్ సినిమా విషయంలో మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అక్కినేని అఖిల్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.అది కూడా ఒక లవ్ స్టోరీ అని తెలుస్తుంది.అయితే ఇంకా ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనేది కన్ఫర్మ్ అవ్వనట్టు తెలుస్తుంది.అదే కనుక నిజమైతే త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

#MostEligible #Pooja Hegdhe #Surender Reddy #MythriMovie #AkkineniAkhil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు