అక్కినేని ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త  

Akkineni Fans Confusing That News About Akhil And Veeru Potla Combination Movie, Akkineni Akhil, Nagarjuna, Most Elegible Bachelor, Prashanth Varma, Bommarillu Baskar, Ragada, Veeru Potla - Telugu Akkineni Akhil, Bommarillu Baskar, Most Elegible Bachelor, Nagarjuna, Prashanth Varma, Ragada, Veeru Potla

అక్కినేని హీరో అఖిల్‌ ప్రస్తుతం తన నాల్గవ సినిమా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాను గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నారు.

 Akkineni Akhil Nagarjuna Veeru Potla Prashanth Varma

కాని కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది.మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రం అనుకున్న సమయంకు విడుదల అయ్యి ఉంటే వెంటనే ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో అఖిల్‌ ఒక సినిమా చేసేవాడు.

కాని ఇప్పుడు ప్రశాంత్‌ వర్మ కరోనా వైరస్‌పై సినిమా చేస్తున్నాడు.

అక్కినేని ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న వార్త-Movie-Telugu Tollywood Photo Image

ప్రశాంత్‌ వర్మతో సినిమా క్యాన్సిల్‌ అవ్వడంతో అఖిల్‌ అయిదవ సినిమాకు దర్శకత్వం ఎవరు చేయబోతున్నారు అనే చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం వీరు పోట్ల ఇంకా అఖిల్‌ల మద్య చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.గతంలో నాగార్జున హీరోగా రగడ అనే చిత్రాన్ని వీరు పోట్ల తెరకెక్కించాడు.అందుకే వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.నాగార్జునకు వీరు పోట్ల అంటే ప్రత్యేకమైన అభిమానం.

అందుకే అఖిల్‌ బాధ్యతను ఆయనకు అప్పగించే అవకాశం ఉందంటున్నారు.

ఇది నిజమో కాదో తెలియదు కాని అక్కినేని ఫ్యాన్స్‌ మాత్రం బాబోయ్‌ అంటున్నారు.ఇప్పటికే అఖిల్‌ నుండి చాలా ఆశిస్తే ఇప్పటి వరకు కమర్షియల్‌ సక్సెస్‌ రాలేదు.ఇలాంటి సమయంలో వీరు పోట్ల వంటి ఫ్లాప్‌ దర్శకుడి చేతిలో అఖిల్‌ను పెట్టడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ నాగార్జును ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంలో అక్కినేని వర్గాల నుండి అధికారిక ప్రకటన కావాలంటూ ఫ్యాన్స్‌ విజ్ఞప్తి చేస్తున్నారు.

#Nagarjuna #Akkineni Akhil #Prashanth Varma #Veeru Potla #Ragada

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akkineni Akhil Nagarjuna Veeru Potla Prashanth Varma Related Telugu News,Photos/Pics,Images..