ఎట్టకేలకు అక్కినేని ప్రాజెక్ట్‌లో జాయిన్‌ అయ్యింది  

Akkineni Akhil Movie Shooting Start-allu Aravindh Producer,bommarillu Baskar,pooja Hegde Actress

అక్కినేని ఫ్యాన్స్‌ ఎన్నో అంచనాలు పెట్టుకున్న అఖిల్‌ మొదటి మూడు సినిమాలతో నిరాశ పర్చాడు.ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తన నాల్గవ సినిమాను చేస్తున్నాడు.దాదాపు ఆరు నెలలుగా ఈ చిత్రం గురించిన టాక్‌ నడుస్తోంది.సినిమా షూటింగ్‌ ఎప్పుడో ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తోంది.

Akkineni Akhil Movie Shooting Start-allu Aravindh Producer,bommarillu Baskar,pooja Hegde Actress-Akkineni Akhil Movie Shooting Start-Allu Aravindh Producer Bommarillu Baskar Pooja Hegde Actress

ఎట్టకేలకు ఈ చిత్రం ప్రారంభం అయ్యింది.సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా రోజులు అయినా కూడా ఇప్పటి వరకు షూటింగ్‌లో హీరోయిన్‌ జాయిన్‌ అవ్వక పోవడంపై పలువురు పలు రకాలుగా అనుకుంటున్నారు.

Akkineni Akhil Movie Shooting Start-allu Aravindh Producer,bommarillu Baskar,pooja Hegde Actress-Akkineni Akhil Movie Shooting Start-Allu Aravindh Producer Bommarillu Baskar Pooja Hegde Actress

ఇదే సమయంలో అక్కినేని హీరో అఖిల్‌ నాల్గవ మూవీలో హీరోయిన్‌పై వార్తలు వచ్చాయి.పలువురి పేర్లను పరిశీలించిన చిత్ర యూనిట్‌ సభ్యులు చివరకు పూజా హెగ్డేను ఫైనల్‌ చేయడం జరిగిందన్నారు.

అయితే షూటింగ్‌లో ఆమె పాల్గొనేందుకు రాకపోవడంతో ఆమె కూడా అనుమానమే అనుకున్నారు.కాని ఎట్టకేలకు షూటింగ్‌లో పూజా హెగ్డే పాల్గొనడం జరిగింది.నిన్నటి నుండి పూజా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లుగా అఖిల్‌ 4 యూనిట్‌ సభ్యులు ప్రకటించాడు.

అల్లు అరవింద్‌ ఈ చిత్రంను నిర్మిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉందా లేదా అనేది చూడాలి.చాలా కాలం తర్వాత బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ బొమ్మకు దర్శకత్వం వహిస్తున్నాడు.బొమ్మరిల్లు వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు నిరాశ పర్చాయి.దాంతో ఈ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకున్నారు.అఖిల్‌ కోసం అల్లు అరవింద్‌ కాస్త ఎక్కువగానే ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.