మజ్ను మళ్లీ వాయిదా.. పాపం అఖిల్‌కే ఎందుకు ఇలా?  

Akkineni Akhil Movie Majnu Is Postponed-

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ హీరోగా ఇప్పటి వరకు వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. భారీ అంచనాల నడుమ రూపొందిన మొదటి రెండు చిత్రాలు కూడా ఆకట్టుకోలేక పోవడంతో మూడవ సినిమాపై ఎక్కువ శ్రద్ద పెట్టినట్లుగా అనిపిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ మూడవ సినిమా తెరకెక్కుతుంది..

మజ్ను మళ్లీ వాయిదా.. పాపం అఖిల్‌కే ఎందుకు ఇలా?-Akkineni Akhil Movie Majnu Is Postponed

ఈ చిత్రాన్ని బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ‘మిస్టర్‌ మజ్ను’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

మొదట ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ సందర్బంగా విడుదల చేయాలని భావించారు. అయితే డిసెంబర్‌లో మూడు నాలుగు సినిమాలు ఉన్న కారణంగా పోటీ వద్దనుకున్న అఖిల్‌ అండ్‌ టీం సినిమాను పోటీ లేని సమయంలో అంటే రిపబ్లిక్‌ డే సందర్బంగా విడుదల చేయాలని భావించారు.

మిస్టర్‌ మజ్నును వచ్చే జనవరి 24న విడుదల చేయాలని భావించారు. అందుకు గాను ఏర్పాట్లు చేస్తున్న సమయంలో నందమూరి బాలకృష్ణ హఠాత్తుగా తన ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని రిపబ్లిక్‌ డే సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. .

‘ఎన్టీఆర్‌’ రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతుంది. మొదటి పార్ట్‌ ‘కథానాయకుడు’ను సంక్రాంతికి, రెండవ పార్ట్‌ ‘మహానాయకుడు’ను రిపబ్లిక్‌ డే సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

దాంతో అఖిల్‌ మూవీ విడుదల విషయంలో ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ మహానాయకుడు ఎలా ఉన్నా కూడా ప్రేక్షకులు ఆ సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ ఇవ్వడం ఖాయం. ఆ సినిమా జోరులో మజ్ను కొట్టుకు పోతాడేమో అనే ఉద్దేశ్యం చిత్ర యూనిట్‌ సభ్యుల్లో ఉంది.

అఖిల్‌ గత చిత్రం ‘హలో’కు మంచి టాక్‌ వచ్చినా కూడా నాని ‘ఎంసీఏ’ చిత్రం పోటీగా రావడంతో కలెక్షన్స్‌ బాగా తగ్గాయి. అందుకే ఈసారి చాలా జాగ్రత్తగా విడుదల ప్లాన్‌ చేయాలని అఖిల్‌ భావిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. త్వరలోనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తామని చెబుతున్నారు.

సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.