మళ్ళీ కొత్త విడుదల తేదీని ప్రకటించిన 'బ్యాచిలర్' టీమ్!

అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు.

 Akkineni Akhil Most Eligible Bachelor Also Joins The Dussehra,dussehra2021, Most-TeluguStop.com

ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా పూజా హెగ్డే ఉంది.

ఇందులో అఖిల్ పూజా రొమాన్స్ సూపర్ ఉంటుందని ఇప్పటికే వార్తలు వాచ్యయి.

ఇక ఈ మధ్యనే విడుదల అయినా లెహరియా పాట చూస్తేనే అర్ధం అవుతుంది.

ఈ సినిమాలో పూజా అఖిల్ రొమాన్స్ ఎలా ఉండబోతుందో అఖిల్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా కొట్టలేదు.ఇక ఎలాగైనా ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవాలని అఖిల్ గట్టిగానే శ్రమించాడు.

ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయినా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కానీ ఈ సినిమా రిలీజ్ మాత్రం అనుకున్న సమయానికి అవ్వడం లేదు. ఎప్పటి నుండో ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూనే ఉంది.ఎట్టకేలకు సెకండ్ వేవ్ తర్వాత అక్టోబర్ 8న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సినిమా ఈసారి మాత్రం వాయిదా పడకుండా రిలీజ్ అవుతుందని అంత భావించారు.కానీ మళ్ళీ మేకర్స్ ఈసారి కూడా ఈ సినిమాను వాయిదా వేశారు.

మళ్ళీ రిలీజ్ డేట్ ను మారుస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.కొత్త రిలీజ్ డేట్ తో ఒక పోస్టర్ విడుదల చేసారు.ఈసారి ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేస్తున్నట్టు తెలిపారు.దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.కుటుంబ సమేతంగా అందరు వచ్చి ఈ సినిమాను చూడాలని మేకర్స్ ప్రేక్షకులను కోరారు.ఈ పోస్టర్ కూడా బాగా ఆకట్టుకుంటుంది.

ఇందులో అఖిల్, పూజా ఇద్దరు చిరునవ్వుతో పలకరించు కుంటున్నట్టు కనిపిస్తుంది.మొత్తానికి ఈ సినిమా మరొకసారి వాయిదా పడింది.

మరి చూడాలి ఈసారి అయినా అనుకున్న సమయానికి విడుదల చేస్తారో లేదో.

https://twitter.com/hegdepooja/status/1442034030346596357

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube