సమంత సొంత ప్రొడక్షన్ మామకు పోటీ కాదుగా?  

Akkaneni Samantha Is Starting Won Production-annapurna Studios,nagachaitanya,samantha,samantha Akkineni,samantha Own Production

సినీ స్టార్స్ ఇండస్ట్రీలో అప్పుడపుడు ప్రొడక్షన్ హౌజ్ లోకి అడుగుపెట్టడం కామన్. క్లిక్కయితే కంటిన్యూ చేస్తారు లేదంటే అక్కడికే ఎండ్ కార్డ్ పెట్టేస్తారు. అంతేగాని ఈ రోజుల్లో ఎవరు రిస్క్ చేయడం లేదు..

సమంత సొంత ప్రొడక్షన్ మామకు పోటీ కాదుగా?-Akkaneni Samantha Is Starting Won Production

అయితే సమంత ఇప్పుడు సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేయనున్నట్లు టాలీవుడ్ లో ఓ వార్త వైరల్ అవుతోంది.

అయితే అక్కినేని కాంపౌండ్ లో ఇప్పటికే రెండు బ్యానర్ లు ఉన్నాయ్. మొదటి నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ హీరోలను కాపాడుకుంటూ వస్తుండగా ఇటీవల కొడుకుల కోసం స్పెషల్ గా ఉంటుందని నాగ్ మనం పేరుతో మరో బ్యానర్ ని స్టార్ట్ చేశాడు. అయితే ఇక ఇప్పుడు సమంత నాగ చైతన్యతో కలిసి మరో బ్యానర్ ని స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది.

సమంత ఏం చేసినా సపోర్ట్ చేసే అక్కినేని ఫ్యామిలీ ఇప్పుడు ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తుంటే ఎంతవరకు సపోర్ట్ చేస్తారో చూడాలి. ఓ బేబీ సక్సెస్ తో నందిని రెడ్డికి సమంత మరో అవకాశాన్ని ఇచ్చింది. ఆ సినిమానే మొదటిసినిమాగా కొత్త బ్యానర్ లో స్టార్ట్ చేయాలనీ సమంత ఆలోచన..

అందుకు భర్త చైతు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.