అక్కడ వీర్యం దానం చేస్తే 3 కోట్లు ఇస్తారట.! ఎక్కడో తెలుసా.?

సంతానం లేని వారికి పిల్లలు కలిగేలా ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి.టెస్ట్ ట్యూబ్ బేబి,సరోగసి వైధ్యరంగంలో ఈ విషయంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.

 Akkada Veryam Dhanam Cheste-TeluguStop.com

గర్భసంచీ మార్పిడి ద్వారా ట్రాన్స్ జెండర్స్ కూడా తల్లైన ఘటనలు చూసాం.అయితే వీటిల్లో భాగంగానే వచ్చిన కాన్సెప్ట్ వీర్యం దానం.

మీరు విన్నది నిజమే.ఆ మధ్య విక్కీ డోనర్ అంటూ హిందీలో వచ్చిన సినిమా తెలుగులో నరుడా డోనరుడా గా వచ్చింది.

అప్పుడు అందరూ ఆ సినిమాను,ఈ కాన్సెప్ట్ ను పెద్దగా పట్టించుకోలేదు కానీ.వీర్యం దానం వలన కోటీశ్వరులు అయిపోవచ్చు తెలుసా.?

‘నరుడా డోనరుడా’ మూవీ లో సుమంత్ వీర్యం దానం చేసి డబ్బు సంపాదించుకోవడం చూసాం.ఈ మూవీ చూసి కొంతమంది ఇదేమి సినిమా అని విమర్శించారు.మరికొంతమంది ఇలా చేస్తే డబ్బులిస్తారా అని ముక్కున వేలేసుకున్నారు.కానీ ఇలా చేస్తే నిజంగానే డబ్బులు ఇస్తారని తాజాగా వెలుగులోకి వచ్చింది.డబ్బులంటే ఏదో పదో పరకో కాదు కోట్లు గుమ్మరిస్తారు.అక్షరాల రూ.3.5 కోట్లు ఇస్తారట.ఏంటి నమ్మడం లేదా ఇది నిజమండి….

పిల్లలు లేనివారికి డాక్టర్స్ మరొకరి వీర్యం లేదా అండంతో కలిపి గర్భాధారణ చేయడం,సరోగసి ద్వారా పిల్లల్ని కనడం ఈ మధ్య చాల చూస్తూనే ఉన్నాం…ఇదే క్రమంలో అమెరికాలోని డెలావర్‌ ప్రాంతంలోని ప్యురెనెటిక్‌ ఎల్‌ ఎల్‌ సీ సంస్థ నాణ్యమైన.

మేటి వీర్యం మరియు అండం కనుగొనాలని భావించింది.దాంట్లో భాగంగానే పురుషుల్ని.మహిళల్ని వీర్యాన్ని.అండాలను దానం చేయమని ఆహ్వానించింది.

దానం చేయాలనుకునే వారు మొదట వారి వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి.ఎంపిక చేసిన వారి నుంచి వీర్యం.

అండం సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు.అంతకు ముందు వీర్యం.

అండం దానం చేసిన వారి కుటుంబ నేపథ్యం, ఆరోగ్య పరిస్థితి., డీఎన్‌ఏలను పరిశీలిస్తారు.

ఆయా అంశాల్లో ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటే వారి నుంచి వీర్యం.అండం సేకరిస్తారు.అలా వారి నుండి సేకరించిన వీర్యానికి రూ.3.5కోట్ల రూపాయలు అందిస్తారట.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube