ఆ ఊరిలో భార్యలను అద్దెకు ఇస్తారు.! ఎంత దారుణమో చూడండి.!       2018-07-02   01:14:06  IST  Raghu V

భారతదేశంలోని స్త్రీ ను ఒక ఆటబొమ్మల ఒక వస్తువుగా చూడటం ఇప్పటికి కొనసాగుతుందనే చెప్పాలి.ఆడపిల్ల అంటేనే చీదరింపులు ఎదుర్కొనే పరిస్థితులు నిత్యం వార్తల్లో పేపర్ లో వస్తూనే ఉంటాయి.ఒకరకంగా స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చింది ఈ సమాజం. పుస్తకాల్లో ఏమో స్త్రీని దేవతతో పోలుస్తూ గౌరవిస్తున్నారు. కానీ బయట సమాజంలో మాత్రం కొందరు స్త్రీ అంటే కేవలం పడక సుఖానికి అన్నట్టు భావిస్తున్నారు.

వధువు కట్నం ఇవ్వడమే తప్పు ఆచారం అని భావిస్తుంటే…ఆ ఊరిలో ఏకంగా భార్యలను అద్దెకు ఇస్తారంటే. ఎంతటి అపచారం కదా.? ఇంతకీ ఈ సంప్రదాయం ఎక్కడ అనుకుంటున్నారా.? మన దేశంలోనే ఇలాంటి సంప్రదాయం ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇలాంటి దారుణాలు మద్యప్రదేశ్‌తో పాటు, రాజస్థాన్‌, గుజరాత్‌లో తరచూ జరుగుతుంటాయి.

స్త్రీ గర్భాశయాన్ని అద్దెకిచ్చే దశ నుంచి, భర్తలు తమ భార్యలను పరాయి పురుషుడికి అద్దెకిచ్చే దశకి వచ్చారు. ఈ సంప్రదాయాన్ని మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో పాటిస్తున్నారు. దధీచ ప్రాత అనే ఈ సంప్రదాయాన్ని పేరు. ఈ ఆచారం ప్రకారం స్త్రీలను లీజుకి ఇవ్వొచ్చట. స్టాంపు పేపరుపై కేవలం ఒక సంతకంతో, ఒక స్త్రీ భర్త మారిపోతాడు. ఒప్పందం కుదిరిన తర్వాత, ఆ మహిళ మరో వ్యక్తికి అమ్ముడుపోతుంది. ఈ ఒప్పందాన్ని అధికారికంగా నిర్ధారించడానికి రూ.10 నుంచి రూ.100 వరకూ ఉన్న స్టాంపు పేపర్లపై ఇరు వర్గాలు సంతకం చేస్తాయి. ఎంత ఎక్కువ ధర పలికితే, అంత ఎక్కువ కాలం ఆ బంధం నిలిచివుంటుంది. ఒప్పందం కాలం అయిపోయాక తిరిగొచ్చిన స్త్రీ మరొక వ్యక్తి కోసం బేరంలో నిలుచుంటుంది.

-

గుజరాత్‌కు చెందిన ఓ నిరుపేద వ్యక్తి తన బార్యను ఒక పటేల్ ఇంట్లో నెలకి 8000 రూపాయల అద్దె భార్యగా పంపాడు. మెహ్సానా, పతన్, రాజకోట్, గాంధీనగర్ వంటి జిల్లాల్లో పిల్లలని కనలేని స్త్రీలు, పేద కుటుంబాల వారికి డబ్బు ఎరగా వేసి ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజన యువతులకు రూ 500 నుంచి రూ.60000 ఇచ్చే విధంగా మధ్యవర్తులు బేరం ఆడతారు. అనంతరం వారికి ఇచ్చే డబ్బులో మధ్యవర్తులు కమీషన్లు వసూలు చేసుకుంటారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కో వ్యక్తి నెలకి రూ.1.5 లక్ష నుంచి 2 లక్షల వరకూ సంపాదిస్తాడు. ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఆ జిల్లాల పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు.

ఇలాంటి చర్యలు అనేకసార్లు పోలీసుల ఎదుట కూడా జరిగాయి. కానీ స్త్రీలు తమంతట తాము నోరువిప్పనంతకాలం, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోనంతకాలం ఎలా అలాంటి వాటిపై చర్యలు తీసుకోగలరు?

నోట్: ఇందులో వాడిన చిత్రాలు కేవలం పరిస్థితిని ఉదహరించటానికి మాత్రమే