పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై కొడుకు అకిరా సంచలన ట్వీట్

ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ప్రధాన పార్టీలు అన్ని ప్రచారంలో దూసుకుపోతున్నాయి.ఇక మూడో ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతుంది.

 Akira Nandan Viral Tweet On Pawan Kalyan-TeluguStop.com

జనసేనాని పవన్ కళ్యాణ్ తన మాటల వాడి, వేడితో ఎన్నికలలో ప్రత్యర్ధి పార్టీలకి చెమటలు పట్టిస్తూ ఉన్నాడు.అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ క్షేత్రంలో ప్రజల మధ్య తిరగాడం కొత్త అని చెప్పాలి.

ఇంతకాలం సినిమాల ప్రపంచంలో ఏసి గదులలో గడిపిన పవన్ కళ్యాణ్ కి భానుడు ప్రతాపం ఎలా ఉంటుందో చూపించింది.

గత వారంలో రోజులుగా విశ్రాంతి లేకుండా ప్రచారకార్యమాలలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ వడదెబ్బ కారణంగా శుక్రవారం తీవ్ర అస్వస్థతకి గురయ్యారు.

దీంతో ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకొని కొంత విశ్రాంతి తీసుకుంటున్నారు.ఇతర రాజకీయ నాయకులులా ఏసి బస్సులలో సేదతీరే అవకాశం పవన్ కళ్యాణ్ కి లేకపోవడంతో శారీరకంగా భాగా అలసిపోయినట్లు డాక్టర్స్ చెప్పి కొంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉంటె ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ కష్టాన్ని చూసి అకిరా నందన్ తీవ్ర భావిద్వేగంకి గురికావడంతో తండ్రిని ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేసాడు.ఇప్పుడు ఆ ట్విట్ వైరల్ గా మారింది.కొద్ది రోజులుగా నిద్రహారాలు లేవు.విశ్రాంతి లేకుండా నాన్న శ్రమిస్తున్న తీరుచూస్తే కంట్లో నీరు ఉబికి వస్తోంది.డీహైడ్రేషన్‌తో బాధపడుతూ కూడా తెనాలి సభకు హాజరుకాబోతున్నారు.

ఓ మనిషి ఎంత మేరకు కష్టపడాలో అంతమేరకు శ్రమిస్తున్నారు.ప్రజల కోసం సర్వం ధారపోస్తున్నారు అంటూ అఖిరా నందన్ చేసిన ట్వీట్ పవన్ అభిమానులకు మాత్రమే కాకుండా జనసైనికులకు కూడ బాగా కనెక్ట్ అయింది.ఇప్పుడు అకిరా చేసిన ట్వీట్ లో అతని ఆలోచన దృక్పథం ఎలా ఉందో జనసైనికులకి అర్ధం అవుతుంది.

దీంతో వాళ్ళంతా ఇప్పుడు మరింత ఉత్సాహంగా పార్టీ గెలుపు కోసం శ్రమించేందుకు సిద్ధం అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube