కర్రసాము ప్రాక్టీస్ చేస్తున్న అకిరా నందన్.. వీడియో లీక్?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కుమారుడు అకిరా నందన్.ఇప్పటి వరకు ఇండస్ట్రీ పరిచయం చేయలేని అకిరాకు పవన్ కళ్యాణ్ తరపున మంచి అభిమానం ఉంది.ఇక 2004 లో జన్మించాడు అకిరా నందన్.పవన్, రేణు దేశాయ్ విడిపోయిన తర్వాత తన పిల్లల్ని ఇద్దరిని తనే చూసుకుంటుంది రేణుదేశాయ్.పవన్ కూడా తన పిల్లల బాధ్యతలను కూడా చూసుకుంటున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా కర్రసాము ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాడు అకిరా నందన్.

 Akira Nandan Practicing Cane Video Leak-TeluguStop.com

రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వల్ల తన పిల్లలకు సంబంధించిన విషయాలను బాగా షేర్ చేసుకుంటుంది.అంతే కాకుండా వాళ్ళ ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.

గతంలో అకిరా నందన్ ఫోటోలు కూడా పంచుకోగా ఆ ఫోటోలను చూసిన పవన్ అభిమానులు అకిరా నందన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని తెగ ప్రశ్నలు కూడా వేశారు.దీంతో ఇటీవలే అకిరా నందన్ ఎంట్రీ ఉంటుందని టాలీవుడ్ లో తెగ వార్తలు వినిపించగా మొత్తానికి పవన్ అభిమానులకు ఇది శుభవార్త అనే చెప్పవచ్చు.

 Akira Nandan Practicing Cane Video Leak-కర్రసాము ప్రాక్టీస్ చేస్తున్న అకిరా నందన్.. వీడియో లీక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియో పంచుకోగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోను తెలుగు ఫిలిం నగర్ అనే వేదికగా అభిమానులకు పంచుకోగా ఇందులో అకిరా నందన్ కర్రసాము ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.ఇక ఈ వీడియోకు తండ్రికి తగ్గట్టు కొడుకని క్యాప్షన్ కూడా ఇవ్వగ ఈ వీడియోని చూసిన నెటిజన్లు తెగ లైక్స్ చేస్తున్నారు.అంతేకాకుండా మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో అంటూ  కామెంట్స్ చేస్తున్నారు.
 

                                                                                                                                                                                  ఇక అకిరా నందన్ ఇండస్ట్రీ ఎంట్రీ కోసం పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ పలు ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ కూడా వినిపించింది.అంతేకాకుండా డాన్స్ , సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.తన చదువు పూర్తయిన వెంటనే నటన మీద శిక్షణ కోసం అమెరికాకు పంపేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నాడట పవన్.ఇక తన మొదటి సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉంటుందని కే జి ఎఫ్ సినిమా నిర్మాతలతో కూడా పవన్ ఒప్పందాలు చేసుకున్నాడని తెలుస్తుంది.

#Practicing Cane #Viral Video #Pawan Kalyan #Akira Nandan #Practice

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు