అకిరాకి టార్చర్ గా మారిన పవన్ ఫాలోయింగ్  

అకిరాకి ఇబ్బందిగా మారిన పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్. .

Akira Nandan Disturb With Pawan Kalyan Fallowing-janasena,megastar,pawan Kalyan Fallowing,renu Desai

పవర్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈ రెండు హోదాలు వేరైనా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ మాత్రం ఒకేలా ఉంది. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత సినిమా హీరోలకి ఫాలోయింగ్ కొంత తగ్గుతుంది. కాని పవన్ కళ్యాణ్ కి రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఇంకా ఫాలోయింగ్ పెరిగింది..

అకిరాకి టార్చర్ గా మారిన పవన్ ఫాలోయింగ్-Akira Nandan Disturb With Pawan Kalyan Fallowing

ప్రత్యర్ధులుగా వైసీపీ, టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ తో రాజకీయంగా విభేదిస్తున్న అతను ప్రస్తుతం జీరో బడ్జెట్ పోలిటిక్స్ చేసిన విధానంపై అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. భవిష్యత్తులో అతనిని ఏపీ ముఖ్యమంత్రిగా చూడొచ్చు అంటూ ఒప్పుకుంటున్నారు.అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఇప్పుడు అతని కొడుకు అకిరాకి టార్చర్ గా మారింది.

పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పుణికిపుచ్చుకున్న అకిరాని టాలీవుడ్ లో పవన్ వారసుడుగా, హీరోగా చూడాలని పవన్ ఫాన్స్ కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం టీనేజ్ లో వున్నా అకిరా ఇలా తండ్రి నుంచి వచ్చే ఫాలోయింగ్ ఇష్టపడకుండా తనకంటూ ఐడెంటిటీ ఉండాలని కోరుకుంటున్నాడు. అయిన కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదో ఒక రూపంలో అకిరాని సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్ చేస్తూ అతనికి అనవసరమైన ఇమేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

దీంతో పవన్ ఫాలోయింగ్ ఇప్పుడు అకిరాకి వ్యక్తిగతంగా టార్చర్ గా మారింది అనే టాక్ వినిపిస్తుంది.