నా బిడ్డ అందరినీ మించిపోయాడు: చిరు  

Akira Nandan Birthday Wishes Megastar Chiranjeevi Pawan Kalyan Varun Tej - Telugu Akira Nandan, Birthday Wishes, Megastar Chiranjeevi, Pawan Kalyan, Ram Charan Tej, Tollywood Celebs, Varun Tej

టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పనవసరం లేదు.అయితే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకి మరింత దగ్గరగా ఉండేందుకు సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ట్విట్టర్లో ఖాతాను కూడా తెరిచారు.

 Akira Nandan Birthday Wishes Megastar Chiranjeevi Pawan Kalyan Varun Tej

అయితే ఈ రోజు తన రెండవ తమ్ముడు అయినటువంటి టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ పుట్టినరోజు సందర్భంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అకీరా కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

ఇందులో భాగంగా “మన బిడ్డ అందరికంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాము.

నా బిడ్డ అందరినీ మించిపోయాడు: చిరు-Latest News-Telugu Tollywood Photo Image

నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు (6’4”).అలాగే అన్ని విషయాల్లో కూడా అందరినీ ఇలాగే మించిపోవాలి.

విష్ యు ఏ “పవర్” ఫుల్ ఫ్యూచర్ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు అఖిరా నందన్” అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు.అలాగే అకీరానందన్ కి టవర్ స్టార్ నాగబాబు కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అకీరానందన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.అంతేగాక పలువురు సినీ సెలబ్రిటీలు కూడా అకీరానందన్ కి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల అకీరానందన్ తెలుగు సినీ పరిశ్రమకి హీరోగా పరిచయం చేసే బాధ్యతలు రామ్ చరణ్ తీసుకున్నాడని అంతేగాక సినీ పరిశ్రమలో తనకు సన్నిహితంగా ఉన్నటువంటి దర్శకుడు ఇప్పటికే అకీరా కోసం కథను రెడీ చేస్తున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అన్నీ కుదిరితే ఈ సంవత్సరం అకీరా నందన్ చిత్రానికి సంబంధించి నటువంటి అప్డేట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Megastar Chiranjeevi Has Wishes To The Akira Nandan Related Telugu News,Photos/Pics,Images..