యూపీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై అఖిలేష్ యాదవ్ సెటైర్లు..!!

Akhilesh Yadav Satires On Bjp In Up Election Compaighn

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో దేశంలో అత్యధికంగా అసెంబ్లీ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా ఒకటి.

 Akhilesh Yadav Satires On Bjp In Up Election Compaighn-TeluguStop.com

ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో… బీజేపీ అధికారంలో ఉంది.ఇదిలా ఉంటే జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా బీజేపీని ఓడించాలని.

ప్రధాన పార్టీలు కీలక వ్యూహాలతో.రంగంలోకి దిగాయి.

 Akhilesh Yadav Satires On Bjp In Up Election Compaighn-యూపీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై అఖిలేష్ యాదవ్ సెటైర్లు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్… కొద్ది నెలల క్రితం నుండే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.అధికార బీజేపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ.

పార్టీలో జోష్ నింపుతున్నారు.కాగా ఇటీవల మధురలో ఓ సభలో.

మాట్లాడిన ఆయన బీజేపీ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.యూపీలో రోడ్ల పరిస్థితి చూస్తే గట్టిగా ఒక కొబ్బరి కాయ కొడితే.

రోడ్లు పగిలిపోయే స్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో బీజేపీ సాధించిన అభివృద్ధి ఇదే అని సెటైర్లు వేశారు.

రాష్ట్రంలో తప్పుడు పాలన సాగుతోంది.ఉద్యోగాలు అదే రీతిలో విద్యారంగ అభివృద్ధికి మరియు రైతు సమస్యలపై బీజేపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

  లీఖింపూర్ లో ఆందోళన చేస్తున్న రైతుల పై జీపు తో… తొక్కించడం ఘటనపై అందులో కేంద్ర మంత్రి కుమారుడు కాదో… క్లారిటీ ఇవ్వాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ నీ… ఈ సభలో అఖిలేష్ నిలదీశారు.ప్రజలలో బీజేపీ పాలనపై అసహనం నెలకొందని.

ఖచ్చితంగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో.బీజేపీ ఓటమి పాలు అవుతుందని.

ముఖ్యంగా యూపీ పశ్చిమ ప్రాంతంలో బీజేపీ అడ్రస్ లేకుండా పోతుందని.ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తామని అఖిలేష్ యాదవ్ ఈ సభలో స్పష్టం చేశారు.

#Akhilesh Yadav #Uttar Pradesh #AkhileshYadav

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube