జడ్జి ఎదుట అఖిలప్రియ..!!  

బోయిన్ పల్లి కిడ్నాప్ కేస్ విషయంలో మాజీ మంత్రి అఖిలప్రియ ప్రధాన నిందితురాలు గా ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మూడు రోజులు కస్టడీకి అప్పగించిన న్యాయస్థానం.

TeluguStop.com - Akhilapriya Before The Judge

విచారణలో అనేక విషయాలు రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి.మూడు రోజుల విచారణ లో.పోలీసులు రోజుకి వంద ప్రశ్నలతో మూడు వందల ప్రశ్నలు వేసి.కీలకమైన సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.

అయితే విచారణలో మిగతా నిందితుల వివరాలు అఖిలప్రియ తెలపడంతో వారిని కూడా విచారించడానికి పోలీసులు రెడీ అవుతున్నట్లు మీడియా సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.కాగా ఈ రోజుతో మూడు రోజులు కస్టడీ ముగియడంతో జడ్జి నివాసంలో అఖిల ప్రియా నీ హాజరు పరచబోతునట్లు సమాచారం.

TeluguStop.com - జడ్జి ఎదుట అఖిలప్రియ..-Political-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత న్యాయమూర్తి నివాసంలో మాజీ మంత్రి అఖిలప్రియ ని హాజరుపరచనున్నట్లు టాక్.కాగా ఈ కేసులో అఖిలప్రియ తో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే మూడు రోజుల కస్టడీ లో పోలీసులు వేసిన ప్రశ్నలకు అఖిల ప్రియ ఎక్కువ సమాధానం చెప్పకుండా కేవలం కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.జడ్జి ఎదుట హాజరుపరిచిన తర్వాత తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.

ఇదిలా ఉంటే అఖిల ప్రియ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది.ఎల్లుండి ఈ పిటిషన్ కి సంబంధించి విచారణ జరగనున్నట్లు సమాచారం.

ఏది ఏమైనా కేసు తీవ్రత బట్టి చూస్తే అఖిలప్రియకు ప్రస్తుతం బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

#Akhila Priya #Gandhi Hospital #BoinpalliKidnap

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు