అయ్యగారి కోసం అంతా..?  

Akhil Surender Reddy Movie To Be Made Of Huge Budget, Akhil, Surender Reddy, Most Eligible Bachelor, Tollywood News - Telugu Akhil, Most Eligible Bachelor, Surender Reddy, Tollywood News

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారుతుండటంతో, ఆయన తొలి కమర్షియల్ సక్సెస్‌ను ఎప్పుడు అందుకుంటాడా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం ప్రస్తుతం మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుంది.

TeluguStop.com - Akhil Surender Reddy Movie To Be Made Of Huge Budget

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా తరువాత అఖిల్ తన నెక్ట్స్ మూవీని స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో చేసేందుకు రెడీ అవుతున్నాడు.

TeluguStop.com - అయ్యగారి కోసం అంతా..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు.కాగా ఈ సినిమాను అతిత్వరలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.అయితే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాను అన్ని విధాలుగా ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా తీర్చిదిద్దేందుకు ఏకంగా రూ.40 కోట్ల బడ్జెట్‌ను కేటాయించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రానుండటంతో అఖిల్ ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో అఖిల్ ఓ స్టైలిష్ మేకోవర్‌తో మనకు కనిపిస్తాడట.ఇక ఈ సినిమాలో హీరోయిన్, మిగతా నటీనటులు ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ నెలలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.అటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్ర షూటింగ్‌ను ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.అతి త్వరలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

#MostEligible #Akhil #Surender Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akhil Surender Reddy Movie To Be Made Of Huge Budget Related Telugu News,Photos/Pics,Images..