ఒక్కటైన అభిజిత్‌, అఖిల్‌.. తీవ్రంగా మండిప‌డ్డ అవినాష్‌?  

akhil supports abhijeet in bigg boss 4! akhil, abhijeet, bigg boss 4, bigg boss telugu, latest news, avinash, nagarjuna - Telugu Abhijeet, Akhil, Avinash, Bigg Boss 4, Bigg Boss Telugu, Latest News, Nagarjuna

బుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ నాగార్జున హోస్ట్ ఇటీవల ప్రారంభ‌మై.ఏడో వారినికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

TeluguStop.com - Akhil Supports Abhijeet In Bigg Boss 4

ఈ వారం నోయ‌ల్‌, అభిజిత్‌, అవినాష్‌, అరియానా, మోనాల్‌, దివిలు నామినేష‌న్‌లో ఉండ‌గా.వీరిలో ఒక‌రు దుకాణం స‌ద్దేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే.నిన్న‌టి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు సినిమా తీయాల‌ని టాస్క్ ఇచ్చారు.

TeluguStop.com - ఒక్కటైన అభిజిత్‌, అఖిల్‌.. తీవ్రంగా మండిప‌డ్డ అవినాష్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ క్ర‌మంలోనే ఇంటి స‌భ్యుల‌కు కొన్ని పాత్ర‌లు కూడా కేటాయించారు.

అభిజిత్ డైరెక్ట‌ర్‌గా, దివి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌గా‌, లాస్య‌ మేక‌ప్ అండ్ స్టైలిష్‌గా, అవినాష్ స్క్రిప్ట్ రైట‌ర్‌గా, నోయ‌ల్ డీఓపీగా, హారిక మ‌రియు సోహైల్ ఐట‌మ్ సాంగ్ డ్యాన్స‌ర్లుగా బిగ్ బాస్ నిర్ణ‌యించారు.

ఇక టాస్క్ ప్రారంభం అవ్వ‌గానే ఎవ‌రి పాత్ర‌లో వారు లీన‌మైపోయారు. ప్రేమ మొదలైంది సినిమాలో అఖిల్‌ మరియు మోనాల్‌ లు హీరో హీరోయిన్‌ గా నటించారు.

వీరి రొమాంటిక్‌ సీన్స్ డైరెక్ట్ చేస్తూ అభి చేసిన కామెడీ హైలైట్ అయింది.అయితే ఈ క్ర‌మంలోనే డైలాగుల విష‌యంలో అవినాష్‌కి, అభిజిత్‌కి గొడ‌వ‌లు వ‌చ్చాయి.

స్క్రిప్ట్ రైట‌ర్‌గా తాను డైలాగులు చెప్పినా తీసుకోవ‌డం లేద‌ని అవినాష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.కానీ, ఈ విష‌యంలో అనూహ్యంగా అభిజిత్‌కు అఖిల్ స‌పోర్ట్ చేశాడు.

వాస్త‌వానికి వీరిద్ద‌రికీ మొద‌ట నుంచి ప‌డ‌దు.ఇందుకు కార‌ణం మోనాల్.

ఆమె కార‌ణంగా ఒకానొక సంద‌ర్భంలో కొట్టుకోవ‌డానికి కూడా సిద్ద‌ప‌డ్డారు.
అయితే నిన్నటి ఎపిసోడ్‌లో మాత్రం అభిజిత్‌కు అఖిల్ స‌పోర్ట్ చేయ‌డం ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది.

మ‌రోవైపు అవినాష్ చివర్లో ఓ సీన్‌లో డైలాగ్ చెప్పబోతుంటే.మ‌ధ్య‌లో లాస్య టచప్‌లు చేస్తూ, దివి అందరినీ డిస్ట్రబ్‌ చేస్తూ కామెడీ చేశారు.

దీన్ని అంద‌రూ ఈజీగానే తీసుకున్నా.అవినాష్ మాత్రం సీరియ‌స్‌గా తీసుకున్నాడు.

దీనిపై మాట్లాడుతూ.తనను కావాల‌నే ఆడుకుంటున్నారని అవినాష్‌ నోయెల్ వ‌ద్ద వాపోయారు.

నామినేషన్స్‌లో అన్నీ చూపిస్తానంటూ మండిప‌డ్డారు.చివ‌ర‌కు ఎలాగోలా సినిమాను పూర్తి చేశారు.

#Avinash #Nagarjuna #Abhijeet #Bigg Boss 4 #Akhil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akhil Supports Abhijeet In Bigg Boss 4 Related Telugu News,Photos/Pics,Images..