సీనియర్ హీరోస్ కు వచ్చే సమస్య, అప్పుడే ఈ కుర్ర హీరో కు!  

Akhil Still Searching For Heroine In Bommarillu Bhaskar Movie-bommarillu Bhaskar Movie,hero Akhil,rashmika Mandanna

అక్కినేని కుటుంబం నుంచి అక్కినేని అఖిల్ హీరో గా వెండి తెరకు అయితే పరిచయం అయ్యాడు కాని ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ ను మాత్రం కొట్టలేకపోయాడు. తొలిసినిమా అఖిల్ అయితే డిజాస్టర్ గా మిగిలిపోగా, ఆ తరువాత వచ్చిన హలొ,మిస్టర్ మజ్నూ లు మాత్రం పర్వాలేదు అని అనిపించాయి. అయితే ఇక నాలుగో సినిమా తో అయినా మంచి హిట్ కొట్టి టాలీవుడ్ లో అక్కినేని వారసుడిగా నిలవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు..

సీనియర్ హీరోస్ కు వచ్చే సమస్య, అప్పుడే ఈ కుర్ర హీరో కు!-Akhil Still Searching For Heroine In Bommarillu Bhaskar Movie

ఈ క్రమంలోనే నాలుగో సినిమా కోసం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో చేయాలనీ ఒక సినిమా కూడా ఫిక్స్ అయ్యాడు. అయితే ఇప్పుడు అఖిల్ ప్రధాన సమస్య హీరోయిన్స్. సీనియర్ హీరో లకు సాధారణంగా ఏ హీరోయిన్ ని పెట్టాలి, వయసు రీత్యా సీనియర్ హీరో ల పక్కన ఎవరైతే బాగుంటారు ఇలా చాలా తిప్పలు పడుతుండడం సహజం.

కానీ ఈ కుర్ర హీరో కి మాత్రం ఆ సమస్య ఇప్పుడే మొదలైపోయింది. ఎవరిని అఖిల్ పక్కన హీరోయిన్ గా ఎంపిక చేయాలి అన్న దానిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఒకపక్క తండ్రి నాగార్జున మాత్రం ఎలాంటి సమస్య లేకుండా కుర్ర హీరోయిన్స్ అయిన రకుల్,కీర్తి సురేష్ లతో సైతం రొమాన్స్ చేసేస్తుండగా, కొడుకు మాత్రం హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డాడు.

తోలి సినిమా లో సయేషా సైగల్,అలానే కళ్యాణి ప్రియదర్శన్,నిధి అగర్వాల్ వంటి కొత్త కొత్త వాళ్ళ తో జోడీ కట్టాడు. అయితే ఇప్పుడు నాలుగో సినిమా కి ఎవరిని హీరోయిన్ గా ఎంపిక చేయాలో అర్ధం కాక కూర్చున్నారు. రష్మిక మందన్న అనుకున్నప్పటికీ ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ కాక ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు అఖిల్ కు జోడీ గా మరో హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు.

నాలుగో చిత్రం కోసం మాత్రం అఖిల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులోనూ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం మరి ఈ సారి అయినా అఖిల్ బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి.