అఖిల్ ఎన్టీఆర్ ను దాటాల్సిందే

సినిమా మొదలవకముందే, నాగార్జునకు సరైన వారసుడు అంటూ తొడలు కొట్టారు అక్కినేని అభిమానులు.ప్రిన్స్ అని వచ్చే తరం సూపర్ స్టార్ అని టాగ్స్ తగిలించారు.

 Akhil Should Start With 50cr Club-TeluguStop.com

ఆ అంచనాలు అందుకోవాలంటే పెద్ద సినిమాతోనే రావాలని భావించిన అఖిల్ మొదటి సినిమానే వివి వినాయక్ తో మొదలుపెట్టాడు.అంచనాలు తారాస్థాయికి చేరాయి.

ఫలితం, 48 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్.దక్షిణ భారతంలో మొదటి చిత్రానికి ఇంత బిజినెస్ చేయడం పెద్ద రికార్డు.

ఇక్కడివరకు బాగానే ఉంది.మరి బయ్యర్లు అంత డబ్బు పెట్టారు, వారికేమైన లాభాలు వస్తాయా ? అఖిల్ లాభాల బాట పట్టాలంటే కనీసం 50 కోట్ల షేర్ కొట్టాల్సిందే.ఇంతవరకు 50 కోట్ల సినిమా ఎన్టీఆర్ కే లేదు.ఇంకా చెప్పాలంటే రాజమౌళి సినిమాలను మినహాయిస్తే ప్రభాస్, రామ్ చరణ్ కి కూడా 50 కోట్ల సినిమా లేదు.

మరి అఖిల్ హిట్ అందుకోవాలంటే ఎన్టీఆర్ ను దాటాల్సిందే.

ఏమాత్రం తేడా కొట్టినా భారి నష్టాలు తప్పవు.ఇంత భారం మొదటి సినిమాకే ఏ హీరో మీద పడలేదేమో.అయితే అఖిల్ కి పోటిగా ఏ సినిమా లేకపోవడం ఊరటే.

మరి అఖిల్ తోలి సినిమాతో హిట్ అందుకుంటాడా ? తోలి చిత్రంతోనే ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోని దాటేస్తాడా ?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube