అక్కినేని అఖిల్ ( Akkineni Akkhil ) పెళ్లి చాలా సంవత్సరాల క్రితమే జరగాల్సి ఉన్నా నిశ్చితార్థం తర్వాత కొన్ని సమస్యలు రావడంతో ఈ పెళ్లి జరగలేదు.అయితే తాజాగా ఒక సందర్భంలో నోరు మెదిపిన అఖిల్ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేశారు.
వచ్చే నెల 28వ తేదీన ఏజెంట్ సినిమా( Agent )తో ప్రేక్షకుల ముందుకు రానున్న అఖిల్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సొంతం చేసుకోవాల్సి ఉంది.ఈ సినిమా కోసం 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చైంది.
దర్శకుడు సురేందర్ రెడ్డి( Surendar Reddy ) ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా అఖిల్ కెరీర్ లో మరో కమర్షియల్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం సీసీఎల్( CCL ) కోసం అఖిల్ ప్రాక్టీస్ చేస్తుండగా అఖిల్ వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.సీసీఎల్ లో నాతో పాటు పాల్గొనే వాళ్లు నాకు స్నేహితులలా ఉంటారని అఖిల్ చెప్పుకొచ్చారు.
స్కూల్ లో క్లాసులకు వెళ్లకుండా క్రికెట్( Cricket ) ఆడుతూ చాలాసార్లు దొరికామని స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టమని క్రికెట్ ఆడుతూ కిటికీల అద్దాలను పగలగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.సోషల్ మీడియా అంటే నాకు భయమని నా సినిమాల గురించి మాత్రమే సోషల్ మీడియా( Social Media ) ద్వారా స్పందిస్తానని అఖిల్ అన్నారు.పెళ్లి రూమర్ల గురించి స్పందించిన అఖిల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని సింగిల్ గా ఉన్న తనకు ఇప్పట్లో మింగిల్ అయ్యే ఆలోచన లేదని అఖిల్ అన్నారు.నేను ప్రేమించేది స్పోర్ట్స్ మాత్రమే అని అఖిల్ చెప్పుకొచ్చారు.
ఏజెంట్ సినిమాలో సాక్షి వైద్య( Sakshi Vaidya ) హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఈ హీరోయిన్ స్టార్ హీరోయిన్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.