బిగ్ బాస్ వాళ్లకి నేనేం కొడుకుని కాదు.. అఖిల్ సార్థక్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

బుల్లితెరపై బిగ్ బాస్ షో సక్సెస్ సాధించిన స్థాయిలో హాట్ స్టార్ ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ నాన్ స్టాప్ షోకు తాజాగా ఎండ్ కార్డు పడగా బింధుమాధవి విన్నర్ గా నిలవడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

 Akhil Sarthak Shocking Comments Goes Viral In Social Media Details Here, Akhil Sarthak, Bigg Boss Show, Bindumadhavi, Bigboss-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్2 విన్నర్ కౌశల్ కొన్ని వారాల క్రితమే బింధుమాధవి విన్నర్ గా నిలిచే ఛాన్స్ ఉందని చెప్పగా ఆయన జోస్యమే నిజమైంది.

అయితే బిగ్ బాస్ సీజన్ 4 లో రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్థక్ ఈ సీజన్ లో కూడా రన్నర్ గా నిలవడం గమనార్హం.

 Akhil Sarthak Shocking Comments Goes Viral In Social Media Details Here, Akhil Sarthak, Bigg Boss Show, Bindumadhavi, Bigboss-బిగ్ బాస్ వాళ్లకి నేనేం కొడుకుని కాదు.. అఖిల్ సార్థక్ షాకింగ్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అఖిల్ ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తాను బిగ్ బాస్ షోకు రన్నర్ అయినా అందరూ విన్నర్ గానే ట్రీట్ చేస్తారని అఖిల్ సార్థక్ పేర్కొన్నారు.

తాను ఏడ్చేశానని ఏదేదో రాసేశారని అఖిల్ సార్థక్ కామెంట్లు చేశారు.

ఒకసారి దెబ్బ తగిలిన వాళ్లకు మళ్లీ దెబ్బ తగిలితే పెద్దగా ఫరక్ పడదని అఖిల్ సార్థక్ చెప్పుకొచ్చారు.

బిందు తన పండు అని మేము సరదాగా ఉన్నామని అఖిల్ సార్థక్ చెప్పుకొచ్చారు.బిగ్ బాస్ షో చివరివారంలో బిందుమాధవిని కలిశానని అఖిల్ సార్థక్ కామెంట్లు చేశారు.

చాలా సంవత్సరాల నుంచి బిందు మాధవి సక్సెస్ కోసం ఎదురుచూస్తోందని తనకు సక్సెస్ దక్కడంతో సంతోషంగా ఉందని అఖిల్ సార్థక్ చెప్పుకొచ్చారు.

మళ్లీ బిగ్ బాస్ షోలోకి వస్తారా అనే ప్రశ్నకు అఖిల్ సార్థక్ స్పందిస్తూ బిగ్ బాస్ వాళ్లకి నేనేం కొడుకుని కాదు అని జవాబు ఇచ్చారు.బిగ్ బాస్ హౌస్ లో నటరాజ్ మాస్టర్, శ్రీరాపాక, ముమైత్‌, తేజు బెస్ట్ కంటెస్టెంట్లు అని అఖిల్ సార్థక్ కామెంట్లు చేశారు.అఖిల్ సార్థక్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube