ఆ పని చేసి బుక్కైన మోనాల్ అఖిల్.. ఏం జరిగిందంటే..?

బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న మోనాల్ అఖిల్ జోడీ బిగ్ బాస్ షో తరువాత కూడా ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్నారు.ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతున్నట్టు వాలంటైన్స్ డే సందర్భంగా ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.

 Akhil Sarthak Monal Gajjar Video Calls Goes Viral In Social Media-TeluguStop.com

అయితే కరోనా ఆంక్షల వల్ల ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఆలస్యమవుతోందని సమాచారం.ఇప్పట్లో ఈ వెబ్ సిరీస్ రిలీజయ్యే అవకాశాలు అయితే లేవని ప్రచారం జరుగుతోంది.

బిగ్ బాస్ షో సీజన్ 4 స్టార్టింగ్ లో మొదట మోనాల్ అభిజిత్ తో సన్నిహితంగా ఉంటూ వచ్చారు.అయితే ఆ తరువాత మోనాల్ అఖిల్ తో కూడా సన్నిహితంగా ఉన్నారు.

 Akhil Sarthak Monal Gajjar Video Calls Goes Viral In Social Media-ఆ పని చేసి బుక్కైన మోనాల్ అఖిల్.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వయస్సు పరంగా అఖిల్ మోనాల్ కంటే చాలా సంగత్సరాలు చిన్న వ్యక్తి అయినప్పటికీ అఖిల్ మోనాల్ క్లోజ్ గానే ఉన్నారు.అప్పుడప్పుడూ మోనాల్ అఖిల్ మధ్య గొడవలు జరిగినా వాళ్లు మళ్లీ కలిసిపోవడం గమనార్హం.

ఈ రీల్ జోడీకి వేర్వేరుగా బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి పారితోషికం కూడా బాగానే వచ్చిందని సమాచారం.ప్రేక్షకుల నుంచి చాలా విమర్శలు వచ్చినప్పటికీ బిగ్ బాస్ నిర్వాహకులు మోనాల్ ను ఏకంగా 14 వారాల పాటు హౌస్ లో కొనసాగించారు.

ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన మోనాల్ ఊహించని విధంగా ఎక్కువ వారాలు కొనసాగడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఆమెకు బిగ్ బాస్ దత్తపుత్రిక అని పేరు పెట్టారు.

అయితే ఒక పని చేసి మోనాల్ అఖిల్ అడ్డంగా బుక్కయ్యారు.

మోనాల్ అఖిల్ వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.బిగ్ బాస్ షో తర్వాత మరింత రెచ్చిపోయి రచ్చ చేస్తూ తమ మధ్య ఏదో ఉందని పరోక్షంగా చెబుతూ ఈ జోడీ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.

#Goes Viral #Video Calls #Akhil Sarthak #Monal Gajjar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు