జంట కాబోతున్న మోనాల్ అఖిల్.. మూహూర్తం ఎప్పుడంటే..?

ఈ మధ్య కాలంలో మోనాల్ అఖిల్ జోడీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత కొన్ని జోడీలు సందడి చేసినా అఖిల్ మోనాల్ స్థాయిలో మాత్రం ఏ జోడీ సందడి చేయలేదు.

 Akhil Sarthak And Monal Gajjar Web Series Starts After Corona Lock Down, After L-TeluguStop.com

అఖిల్ మోనాల్ మధ్య స్నేహ బంధం కొనసాగుతూ ఉండటంతో పాటు అఖిల్ మోనాల్ కలిసి దిగిన ఫోటోలు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బిగ్ బాస్ షో ద్వారా మోనాల్ అఖిల్ స్టార్ సెలబ్రిటీలుగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు.

అఖిల్ మోనాల్ ప్రేమికులా.? స్నేహితులా.? అనే విషయంలో స్పష్టత లేకపోయినా వీళ్ల సోషల్ మీడియా పోస్టులు మాత్రం వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే ప్రేమికుల రోజు సందర్భంగా ఈ జోడీ తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

అయితే చాలారోజుల నుంచి ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అప్ డేట్ లేకపోవడంతో ఈ వెబ్ సిరీస్ ఆగిపోయిందా.? అనే ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించాయి.

అయితే అఖిల్ ప్రస్తుతం ఫస్ట్ టైమ్ అనే సినిమా పనులతో బిజీగా ఉన్నారు.

Telugu Lock, Akhil Time, Akhil Monal Web, Akhil Sarthak, Anika Vikraman, Corona

అఖిల్ సార్థక్ కు జోడీగా ఈ సినిమాలో అనిక విక్రమన్ నటిస్తున్నారు.మరోవైపు మోనాల్ కొన్ని టీవీ షోలతో బిజీగా ఉన్నారు.అయితే ఈ వెబ్ సిరీస్ మొదలు కాకపోవడం గురించి తాజాగా అఖిల్ సార్థక్ స్పందిస్తూ తాను, మోనాల్ వరుస ఆఫర్లతో బిజీగా ఉండటంతో డేట్లు సర్దుబాటు కాలేదని త్వరలో డేట్లు అడ్జెస్ట్ చేసి ఆ వెబ్ సిరీస్ పూర్తి చేస్తామని మోనాల్ అన్నారు.

Telugu Lock, Akhil Time, Akhil Monal Web, Akhil Sarthak, Anika Vikraman, Corona

త్వరలోనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానుందని లాక్ డౌన్ నిబంధనలు పూర్తైన తరువాత ఈ వెబ్ సిరీస్ జరగనుందని సమాచారం.మళ్లీ మోనాల్ అఖిల్ జంట కానుండగా సోషల్ మీడియాలో త్వరలో ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube