వెబ్ సిరీస్ కోసం రాక్ స్టార్ గా మారబోతున్న అఖిల్  

Akhil Play Rock star role in Web Series, Akkineni, Most Eligible Bachelor, OTT Platform, Digital Entertainment - Telugu Akhil Play Rock Star Role In Web Series, Akkineni, Digital Entertainment, Most Eligible Bachelor, Ott Platform

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా కారణంగా అప్రకటిత లాక్ డౌన్ మొత్తం కనిపిస్తుంది.అన్ని రంగాలు పూర్తిగా కుదేలైపోయే పరిస్థితి.

 Akhil Play Rock Star Role In Web Series

కోట్ల మంది ప్రజలు ఉపాధి కోల్పోయి కట్టుకున్న బట్టతో సొంత ఊళ్ళకి వెళ్లిపోయారు.ఇక సిటీలలో ఉన్న వారు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

కనీసం ఇళ్ళకి రెంటులు కట్టలేని స్థితిలో ఉన్నారు.ఇలాంటి వేళ సినిమా రంగం కూడా కుదేలైంది.

వెబ్ సిరీస్ కోసం రాక్ స్టార్ గా మారబోతున్న అఖిల్-Movie-Telugu Tollywood Photo Image

సినిమా షూటింగ్ లు అన్ని ఆగిపోయాయి.థియేటర్లు ఇంకా ఓపెన్ కాలేదు.

ఎప్పటికి ఓపెన్ అవుతాయి అనేది తెలియని విషయం.ఈ నేపధ్యంలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా ఎక్కువైంది.

ఓటీటీ ఛానల్స్ రిలీజ్ కి రెడీ అయ్యి ఉన్న సినిమాలని కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నాయి.అలాగే వెబ్ సిరీస్ లని ఎక్కువగా తీసుకొచ్చేనందుకు ప్లాన్ చేస్తున్నాయి.

భవిష్యత్తులో వారికే మంచి డిమాండ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో కూడా వినిపిస్తూ ఉండటంతో దర్శకులు, నటులు అందరూ వాటి వైపు మొగ్గు చూపిస్తున్నారు.

ఇక అక్కినేని యువ హీరో అఖిల్ కూడా వెబ్ సిరీస్ లపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అక్కినేని కుటుంబం నుండి సమంత ది ఫ్యామిలీ మాన్ 2 లో ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.అయితే అదే తరహా లో బాలీవుడ్ లో ఒక క్రేజీ వెబ్ సిరీస్ లో నటించేందుకు అఖిల్ కి ఒక అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

అందులో రాక్ స్టార్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే వెబ్ సిరీస్ లో నటిస్తే స్టార్ హీరో కావాలనుకున్న తనకి పెద్ద ఇబ్బంది అవుతుందని ఓ వైపు ఆలోచిస్తున్న బాలీవుడ్ లో కూడా అవకాశాలు పెంచుకోవడానికి వెబ్ సిరీస్ ఉపయోగపడుతుందని మరో వైపు ఆలోచిస్తున్నాడు.

దీంతో తండ్రి నాగార్జున నిర్ణయం మేరకు ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు బోగట్టా.

#Akkineni #OTT Platform

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akhil Play Rock Star Role In Web Series Related Telugu News,Photos/Pics,Images..