అఖిల్‌ ఈ విషయంలో మాత్రం స్టార్‌ హీరో       2018-06-07   00:42:41  IST  Raghu V

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ హీరోగా ఇప్పటి వరకు వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఏమాత్రం ఆకట్టుకోని కథతో రెండు సినిమాలు చేశాడు. అఖిల్‌ మొదటి రెండు సినిమాలు నిరాశ పర్చడంతో అక్కినేని ఫ్యాన్స్‌ స్టార్‌ హీరోగా మహేష్‌, చరణ్‌ వంటి వారికి పోటీ ఇస్తాడని భావించిన అఖిల్‌ ఇలా ఫ్లాప్‌ అవ్వడంతో నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం అఖిల్‌ తన మూడవ సినిమాను చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ మూడవ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు కమర్షియల్‌గా సక్సెస్‌ను దక్కించుకోక పోయినా కూడా కమర్షియల్‌ హీరోగా మాత్రం ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది.

సహజంగా హీరోలు వరుసగా విజయాలు సాధించి, ఓ రేంజ్‌కు వెళ్లిన తర్వాత కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశాలు వస్తుంటాయి. కొందరు హీరోలు కావాలనుకున్న కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించే ఛాన్స్‌లు రావు. కాని అఖిల్‌కు మాత్రం ఒక్క సినిమా కూడా చేయకుండానే ఆ అవకాశాలు దక్కాయి. ప్రముఖ బ్రాండెడ్‌ వాచ్‌కు మరియు శీతల పానియంకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశం దక్కింది. వాటి ద్వారా మంచి గుర్తింపును పొందిన అఖిల్‌ సినిమాలతో మాత్రం సక్సెస్‌లను పొందలేక ఢీలా పడిపోయాడు.

ప్రస్తుతం సినిమాలతో సక్సెస్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అఖిల్‌ ఇప్పుడు కూడా కమర్షియల్‌ యాడ్స్‌లో బిజీగా ఉంటున్నాడు. లక్షలకు లక్షలు పారితోషికం తీసుకుంటూ బ్రాండ్స్‌కు పబ్లిసిటీ చేస్తున్నాడు. తాజాగా ఒక జిమ్‌ను ప్రారంభించేందుకు అఖిల్‌ ఏకంగా 12 లక్షల రూపాయలు తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. కేవలం గంటల సమయం కేటాయించినందుకు ఆయన ఈ రేంజ్‌లో పారితోషికంను దక్కించుకున్నారు. యువ హీరోల్లో ప్రస్తుతం ఈ రేంజ్‌ క్రేజ్‌ అఖిల్‌కు మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు.

చేసిన రెండు సినిమాలు ఫ్లాప్‌ అవ్వడంతో పాటు, ప్రస్తుతం ఒక చిన్న చిత్రాన్ని చేస్తున్న ఈయన ఇంత భారీ రేంజ్‌లో పారితోషికం అందుకోవడం గ్రేట్‌ అంటూ అక్కినేని ఫ్యాన్స్‌ స్వయంగా అంటున్నారు. వరుసగా రెండు మూడు బ్లాక్‌ బస్టర్‌లు అఖిల్‌ ఖాతాలో పడితే టాలీవుడ్‌ టాప్‌ హీరోల జాబితాలో అఖిల్‌ చేరడం ఖాయం అంటూ అక్కినేని ఫ్యామిలీ నమ్మకంగా ఉంది. పు చిత్రాలు చేసి, ఎన్నో సక్సెస్‌లను అందుకున్న నాగచైతన్య కంటే కూడా ప్రస్తుతం అఖిల్‌కు ఎక్కువ క్రేజ్‌ ఉందని స్వయంగా అక్కినేని ఫ్యాన్స్‌ ఒప్పుకుంటున్నారు. సినిమాలు సక్సెస్‌ కాకుండానే అఖిల్‌ స్టార్‌ అయ్యాడు అంటూ ఫ్యాన్స్‌ సంతోషంగా ఉన్నారు.