ముగ్గురు హీరోలు కావాలి అంటున్న హీరోయిన్

అఖిల్ తో టాలివుడ్ లో గ్రాండ్ ఎంట్రి ఇచ్చింది సయేశా సైగల్.

అలనాటి బాలివుడ్ మెగాస్టార్ దిలీప్ కుమార్ కి సయేశా మనవరాలు అన్న సంగతి తెలిసిందే.

అంత పెద్ద సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టే అఖిల్ అక్కినేని సరసన మొదటి అవకాశం సంపాదించడమే కాకుండా, అజయ్ దేవగన్ డ్రీం ప్రాజెక్ట్ "శివాయ్" లో ఛాన్స్ కొట్టేసింది ఈ టినేజ్ బ్యూటి.మరి తెలుగులో అఖిల్ తరువాత చేయబోతున సినిమాల గురించి అడిగితే "నాకు తెలుగులో చాలా సినిమాలు చేయాలని ఉంది.

Sayesha Desires To Work With Mahesh,Allu Arjun And Ram Charan-Sayesha Desires To

ప్రస్తుతం హిందీలో శివాయ్ చేస్తున్నాను.అలాగే తెలుగులో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

అటు హిందీ, ఇటు తెలుగు సినిమాలు చేయాలని ఉంది.అఖిల్ లో నటించక ముందు వరకు నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు.

Advertisement

హిందీలో డబ్ అయిన కొన్ని సినిమాలు మాత్రమే చూసాను.ఆ మధ్య మహేష్ బాబు శ్రీమంతుడు శ్రీమంతుడు, రాజమౌళి సర్ " బాహుబలి సినిమాలు చూసాను.

మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి టాలెంటెడ్ హీరోస్ తో కలిసి వర్క్ చేయాలనుంది.నాకు తెలుగు ప్రజలపై, తెలుగు భాషపై చాలా ఇష్టం పెరిగింది " అంటూ చెప్పుకొచ్చింది ఈ చిన్నది.

Advertisement

తాజా వార్తలు