అఖిల్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న బ్యాచిలర్ టీజర్..?  

young hero akhil most eligible bachelor teaser Akhil, Most Eligible Bachelor, Bommarillu Baskar, Ramcharan, Orange, Ongole Gitta, Most Eligible Bachelor Teaser - Telugu Akhil, Bommarillu Baskar, Most Eligible Bachelor, Most Eligible Bachelor Teaser, Ongole Gitta, Orange, Ramcharan

ప్రస్తుతం యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాపైనే ఉన్నాయి.చిన్నతనంలోనే సిసింద్రీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అఖిల్ కు పెద్దయ్యాక అదృష్టం కలిసి రావడం లేదు.

TeluguStop.com - Akhil Most Eligible Bachelor Teaser

అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తోనైనా అఖిల్ సక్సెస్ కొడతాడా అంటే కష్టమే అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అఖిల్ వరుస ఫ్లాపులతో ఎలా సతమతవుతున్నాడో ఈ సినిమా డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కూడా అదే విధంగా ఫ్లాపులతో సతమతమవుతున్నాడు.

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ గా కెరీర్ మొదట్లో తెరకెక్కించిన బొమ్మరిల్లు, పరుగు సినిమాలు హిట్లైనా ఆ తరువాత తెరకెక్కించిన ఆరెంజ్, ఒంగోలు గిత్త సినిమాలు డిజాస్టర్లు అనిపించుకున్నాయి.దీంతో బొమ్మరిల్లు భాస్కర్ కు అవకాశాలు రాలేదు.

TeluguStop.com - అఖిల్ ఫ్యాన్స్ ను భయపెడుతున్న బ్యాచిలర్ టీజర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

చాలా కాలం తరువాత బొమ్మరిల్లు భాస్కర్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కు దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది.అయితే ఈ సినిమా ఆయన ఫ్లాప్ సినిమా ఆరెంజ్ ను ప్రేక్షకులకు గుర్తు చేస్తోంది.

అటు రామ్ చరణ్, ఇటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్లలో ఆరెంజ్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్.ఆ సినిమా వల్ల కోట్ల రూపాయలు నష్టపోయానని నాగబాబు ఇప్పటికీ చెబుతూ ఉంటారు.

ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోనూ ఆ సినిమా పోలికలుండటం గమనార్హం.ఆరెంజ్ సినిమాలోలా ప్రేమ, పెళ్లి చుట్టే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తెరకెక్కుతుండటం, టీజర్ లో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా అఖిల్ కు హిట్టిస్తుందా.? చూడాల్సి ఉంది.

టీజర్ లో డైలాగులు కూడా పెద్దగా ఆకట్టుకోలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అఖిల్ నటించిన తొలి మూడు సినిమాలు ఫ్లాప్ అయినా ఆ సినిమాల్లో అఖిల్ ఎంతో జోష్ తో కనిపించాడని ఈ సినిమాలో మాత్రం డల్ గా ఉన్నాడని ఫ్యాన్స్ చెబుతున్నారు.అయితే టీజర్ పై నెగిటివ్ టాక్ వచ్చినా గతంలో ఎన్నో సినిమాలు సక్సెస్ అయ్యాయి కాబట్టి అఖిల్ కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తాడేమో చూడాల్సి ఉంది.

టీజర్ కు నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా అయినా అఖిల్ కు హిట్టిస్తుందో లేదోనని ఆయన ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

#Ongole Gitta #Akhil #MostEligible #MostEligible #Ramcharan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akhil Most Eligible Bachelor Teaser Related Telugu News,Photos/Pics,Images..