ఓటిటీలో స్ట్రీమింగ్ కాబోతున్న 'బ్యాచిలర్'.. ఎప్పుడంటే?

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’.ఈ సినిమాలో అఖిల్ కు జంటగా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటించింది.

 Akhil Most Eligible Bachelor Movie Released On Ott Platform, Aha Ott,akkineni Ak-TeluguStop.com

దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల అయినా బ్యాచిలర్ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.అఖిల్ 6 ఏళ్లగా ఏ హిట్ కోసమైతే తపించి పోతున్నాడో ఆ హిట్ బ్యాచిలర్ సినిమా ద్వారా వచ్చింది.

మోస్ట్ ఎలిజిబుల్ బైచిలర్ సినిమాతో అసలైన విజయం ఎలా ఉంటుందో రుచి చూసాడు.మొన్నటి వరికి థియేటర్స్ లో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లో రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమా నవంబర్ 19 నుండి నెట్ ఫ్లిక్స్, ఆహా ఓటిటి ల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.ఈ సినిమాను బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు.

ఇక ఈ సినిమా బయ్యర్లకు బాగానే కలిసి వచ్చింది.

Telugu Aha Ott, Akhileligible, Akkineni Akhil, Netflix, Ott, Ott Ups, Pooja Hegd

దాదాపు 3 కోట్లకు పైగానే ఈ సినిమాతో లాభాలు వచ్చాయని తెలుస్తుంది.ఈ సినిమాలో అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.ముఖ్యంగా లెహరాయి పాట ఇప్పటికి అందరి నోళ్ళలో నానుతుంది.

ఇక ఇంత పెద్ద హిట్ వచ్చిన జోష్ లో అఖిల్ తర్వాత చేసే ఏజెంట్ సినిమాను కూడా అంతే హుషారుగా పూర్తి చేస్తున్నాడు.ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Telugu Aha Ott, Akhileligible, Akkineni Akhil, Netflix, Ott, Ott Ups, Pooja Hegd

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.ఏజెంట్ సినిమాలో అఖిల్ లుక్ అభిమానులందరినీ ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.ఈ భారీ యాక్షన్ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్స్, సురేందర్ రెడ్డి 2 సినిమా సంయుక్తంగా నిర్మిస్తుండగా మ్యూజిక్ సెన్సషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube