కొత్త సినిమాలతో అఖిల్ 'బ్యాచిలర్‌' కు డ్యామేజ్ ఎంత?

అఖిల్‌ అక్కినేని మొదటి కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఏడు వారాల్లో 40 కోట్ల వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమాకు రెండవ వారం ఎంత వసూళ్లు నమోదు అవుతాయి అనేది ఆసక్తికరంగా మారింది.

 Akhil Most Eligible Bachelor Movie Collections-TeluguStop.com

ఈ సినిమా కు పోటీగా దసరా బరిలో నిలిచిన మహా సముద్రం మరియు పెళ్లి సందడి సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన ఆ రెండు సినిమాల వసూళ్లు చాలా నీరసంగా ఉన్నాయి.

ఇదే సమయంలో బ్యాచిలర్ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.ఇక ఈ వారం విడుదల అయిన నాట్యం సినిమా మాత్రమే కాస్త ఫేమ్ ఉన్న సినిమా.

మిగిలిన ఏ ఒక్క సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోవడం మాత్రమే కాకుండా కనీసం జనాలు నోటీస్ చేసే విధంగా కూడా లేవు.

Telugu Akhil, Tollywood-Movie

నాట్యం సినిమా క్లాస్ ఆడియన్స్ కు ఆకట్టుకుంటుందేమో కాని బి సి క్లాస్ వారికి ఆ సినిమా ఎక్కే అవకాశాలు కనిపించడం లేదు.దాంతో నాట్యం సినిమా కూడా వసూళ్ల పరంగా సాదా సీదాగానే ఉండే అవకాశం ఉంది.ఇక ఈ వారంలో కూడా బ్యాచిలర్‌ సినిమా భారీ వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.40 కోట్ల వసూళ్లు దక్కించుకున్న ఈ సినిమా కు మరో పది కోట్లు అదనంగా వచ్చి చేరడం ఖాయం అని.తద్వార 50 కోట్ల క్లబ్‌ లో ఈ సినిమా చేరబోతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.ఈ వారం విడుదల అయిన సినిమా లు బ్యాచిలర్ కు డ్యామేజీ ఏమీ చేయక పోవచ్చు అంటున్నారు.ఖచ్చితంగా ఈ సినిమా 50 కోట్ల క్లబ్‌ లో చేరడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube