అఖిల్‌ ఆశలన్నీ అడియాశలు అవుతున్నాయి  

Akhil Akkineni, Pooja Hegde, Most Eligible Bachelor Movie, Akhil fans disappointed with Most Eligible Bachelor Movie New Poster - Telugu Akhil Akkineni, Akhil Fans Disappointed With Most Eligible Bachelor Movie New Poster, Comments On Most Eligible Bachelor Movie New Poster, Most Eligible Bachelor Movie, Pooja Hegde

అక్కినేని హీరో అఖిల్‌ చేసిన మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.దారుణమైన పరాజయం పాలయిన ఆ మూడు సినిమాల నుండి బయట పడేందుకు అఖిల్‌ ప్రస్తుతం మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రాన్ని చేస్తున్నాడు.

 Akhil Most Eligible Bachelor

బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నాడు.ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్‌ చాలా నమ్మకంతో ఉన్నారు.

సినిమా సమ్మర్‌లో విడుదల అయితే ఫ్యాన్స్‌కు మంచి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ట్రీట్‌ దక్కడం ఖాయం అనుకున్నారు.
అఖిల్‌ కూడా ఈ సినిమాతో మొదటి సక్సెస్‌ దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు.

అఖిల్‌ ఆశలన్నీ అడియాశలు అవుతున్నాయి-Movie-Telugu Tollywood Photo Image

అయితే తీరా ఈ సినిమా ఫలితాన్ని చూస్తుంటే మాత్రం మొత్తం తారు మారు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇప్పటి వరకు సినిమాకు బజ్‌ క్రియేట్‌ చేయడంలో చిత్ర యూనిట్‌ సభ్యులు సఫలం కాలేదు.

తాజాగా రొమాంటిక్‌ పోస్టర్‌ అంటూ పూజా హెగ్డే తొడలను చూపించారు.అఖిల్‌ మరియు పూజా హెగ్డేల జోడీ సరిగా లేదంటూ మొదటి నుండి కామెంట్స్‌ వస్తున్నాయి.

తాజా పోస్టర్‌లో కూడా అఖిల్‌ కంటే కాస్త ఎక్కువ వయసు అమ్మాయిగా పూజా కనిపిస్తుంది అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.ఈ నేపథ్యంలో పూజా హెగ్డే మరియు అఖిల్‌ ల జోడీ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రంతో ఆకట్టుకుంటారా లేదా అనే అనుమానం వ్యక్తం అవుతోంది.త్వరలోనే ఈ చిత్రం బ్యాలన్స్‌ వర్క్‌ ను పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.ఈ చిత్రం తర్వాత అఖిల్‌ మరో సినిమాను ఇదే ఏడాది విడుదల చేయాలనుకున్నాడు.

కాని కరోనా కారణంగా ఆయన ఆశలన్నీ అడియాశలు అయ్యాయి.వచ్చే ఏడాదిలో అయినా అఖిల్‌ రెండు సినిమాలు చేస్తాడేమో చూడాలి.

#Akhil Akkineni #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Akhil Most Eligible Bachelor Related Telugu News,Photos/Pics,Images..