అఖిల్- మోనాల్ బంధం నిజంగానే పెళ్ళి వరకు వెళ్ళనుందా..?!

బుల్లితెరపై 100 రోజుల పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నా షో. బిగ్ బాస్ సీజన్ 4.

 Bigg Boss, Season 4, Akil, Sohel, Monal, House Mates, Marraige, Romance-TeluguStop.com

హౌస్ లో హైలెట్ అయిన సంఘటనలలో ఒకటిగా అఖిల్, మోనల్ లవ్ స్టోరీ ఒకటి.వీరిద్దరూ చేసే రొమాన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.

కొన్ని సందర్భాలలో హద్దులు మీరి వీరి రొమాన్స్ ఒక వర్గ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టినా.కాకపోతే బిగ్ బాస్ మాత్రం ఈ ఒక్క పాయింట్ మీద వీరిద్దరిని హౌస్ లో ఉండేందుకు కూడా సహాయపడినట్లు వార్తలలో మనం చూస్తూనే ఉన్నాం.

ఇది ఇలా ఉండగా.మోనల్ ఎలిమినేట్ అయిన రోజు జరిగిన సంఘటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మోనల్ ఏదో దేశం విడిచి పరాయి దేశం వెళ్తున్నట్లు అఖిల్ తెగ బాధపడిపోయాడు.అంతేకాకుండా మోనల్ ను అఖిల్ నేను బయటకు వచ్చేంత వరకు హైదరాబాద్ లోనే ఉండాలని, బయటకు వచ్చిన అనంతరం నిన్ను కలుస్తాను అని ఆమెకు తెలిపాడు.

దీంతో మోనల్ హైదరాబాద్ లోనే ఉంటూ తన సమయాన్ని గడిపేసింది.

Telugu Akil, Bigg Boss, Mates, Marraige, Monal, Romance, Season, Sohel-Latest Ne

మోనల్, అఖిల్ తరచుగా కలుస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లో ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉన్న ఈ జంట పెళ్లి చేసుకుంటారు అన్న వార్తలు మనం చాలానే చూశాం.ఇందుకు కారణం కూడా లేకపోలేదు హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం కూడా అఖిల్, మోనాల్ ఇద్దరి బంధం కొనసాగుతూనే ఉంది.

ఈ తరుణంలో ఇటీవల సోహెల్, అఖిల్ వీరందరూ కూడా ఒక గెట్ టు గెదర్ పార్టీని కూడా చేసుకున్నారు.అలాగే మోనాల్ కు కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ రావడంతో హైదరాబాద్ నుండి మోనల్ బయటకు వెళ్ళటం లేదు.

దీనితో మోనాల్ – అఖిల్ మధ్య బంధం మరింత బలపడి వివాహం చేసుకుంటారెమో అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.చూడాలి మరి వీరి బంధం ఎంతవరకు వెళుతుందో.?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube