బంగార్రాజులో అఖిల్‌ కూడా ఉంటాడా... కథ ఇదేనా?  

Akhil In Bangar Raju-

నాగార్జున హీరోగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో మూడు ఏళ్ల క్రితం వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రంలోని బంగార్రాజు పాత్రతో ఒక చిత్రంను చేయాలని రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఎట్టకేలకు కథ సిద్దం అయ్యింది.నాగార్జున ప్రధాన పాత్రలో నటించబోతున్న బంగార్రాజు చిత్రంలో నాగచైతన్య కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆ వార్తలు నిజమే అంటూ స్వయంగా నాగచైతన్య కూడా స్పందించాడు...

Akhil In Bangar Raju--Akhil In Bangar Raju-

నాగచైతన్య తన తండ్రి నాగార్జున చిత్రంలో నటించబోతున్నట్లుగా పేర్కొన్నాడు.తాజాగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నాగార్జున తండ్రి పాత్రలో కనిపించనుండగా నాగచైతన్య మరియు అఖిల్‌లు ఆయన కొడుకులుగా కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Akhil In Bangar Raju--Akhil In Bangar Raju-

అఖిల్‌ మూవీ ప్రస్తుతానికి ఏది కమిట్‌ కాలేదు.తండ్రితో బంగార్రాజు చిత్రంను చేసిన తర్వాత తన కొత్త సినిమాను చేయాలని భావిస్తున్నాడట.అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి.

కథ బాగుండటంతో తన ఇద్దరు కొడుకులతో కూడా నటింపజేసేందుకు నాగార్జున ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

తండ్రి పాత్రలో కనిపించబోతున్న నాగార్జున ప్లేబాయ్‌ కాగా, ఆయన కొడుకులు అయినా నాగచైతన్య మరియు అఖిల్‌లు అమాయకపు అబ్బాయిలుగా కనిపించబోతున్నారు.సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో బంగార్రాజు పాత్రలో నాగార్జున కనిపించబోతున్న నేపథ్యంలో ఆ సినిమాలోని మరో నాగార్జున పాత్ర పోషించిన పాత్రలాగే నాగచైతన్య మరియు అఖిల్‌లు చేస్తున్నారట.మొత్తానికి అక్కినేని వారి ముగ్గురు హీరోల సినిమా అనడంతో అంచనాలు భారీగా ఉండే అవకాశం ఉంది.

వచ్చే సంక్రాంతికి సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.