పూజాహేగ్దే క్రేజ్ మీద హోప్స్ పెట్టుకున్న బ్యాచ్‌లర్

అక్కినేని యువ హీరో అఖిల్ కమర్షియల్ హీరో లక్షణాలు పుష్కలంగా ఉన్న అతని స్టొరీ సెలక్షన్ సరైన విధంగా లేకపోవడం వలన, అలాగే వయసుకి మించిన పాత్రలు చేయడం వలన అతని సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు.ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు అతనికి ఫ్లాప్ హీరో ఇమేజ్ ని ఇచ్చాయి.

 Akhil Hopes On Pooja Hegde Crazy, Tollywood, Most Eligible Bachelor Movie, Ahil,-TeluguStop.com

అయితే నటుడుగా సినిమా సినిమాకి తనని మెరుగు పరుచుకుంటూ అఖిల్ కమర్షియల్ హీరోగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.అఖిల్ యాక్టింగ్ లో అక్కినేని ఫ్యామిలీ హీరోలకి లేని ఒక కమర్షియల్ స్టైల్ ఉంటుంది.

అతను కచ్చితంగా ఆ జోనర్ లో సక్సెస్ అవుతాడు.అయితే దానికి సరైన సినిమా పడాలి.

అలాంటి సినిమాగానే ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఉంటుంది అనే హోప్స్ తో అఖిల్ ఉన్నాడు.

ఒంగోలు గిత్త ఫ్లాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా కావడం, అది కూడా సక్సెస్ ఫుల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్స్ గా ఉన్న గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సినిమా కావడం దీని మీద అంచనాలు ఉన్న అఖిల్ హీరో అనేసరికి చాలా వరకు ఆడియన్స్ నీరసించిపోయారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఈ మధ్య కాలంలో వరుసగా సక్సెస్ లు అందుకుంటూ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ దూసుకుపోతున్న పూజాహెగ్డే ఉండటం సినిమా మీద కాస్తా అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని తెలుస్తుంది.

పూజా హెగ్డే గ్లామర్ షో కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.పూజాహెగ్డే గ్లామర్ ఇమేజ్ ని మార్కెట్ లోకి తీసుకెళ్ళి దాంతో పాటు అఖిల్ కి కూడా మైలేజ్ తీసుకొచ్చే పనిలో నిర్మాతలు ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube