ప్రచారం చేయకుండానే గెలిచి రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన అఖిల్ గొగోయి.. !

రాజకీయాల్లో చరిత్ర సృష్టించాలంటే పెద్ద పెద్ద బ్యాక్ గ్రౌండ్, నేతల సపోర్ట్, డబ్బులు వెదజల్లడం వంటి చీఫ్ మైండ్ ఉండవలసిన అవసరం లేదని నిరూపించిన ఘటన అవినీతి పరులను సిగ్గుపడేలా చేస్తుంది.

 Akhil Gogoi Who Created A New History In Politics By Winning Without Campaigning-TeluguStop.com

ఇక ఎన్నికల్లో గెలవాలంటే వీపరితంగా ప్రచారం, సాధ్యం కానీ హామీలు, విచ్చలవిడిగా డబ్బులిచ్చి ఓటర్లను కొనుక్కొవడం వంటివి లేకుండా, ప్రజలకు నచ్చితే చాలు గెలిపిస్తారనే నమ్మకాన్ని చాటేలా రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.

ఆ వివరాలు చూస్తే.

 Akhil Gogoi Who Created A New History In Politics By Winning Without Campaigning-ప్రచారం చేయకుండానే గెలిచి రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన అఖిల్ గొగోయి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అస్సాంకు చెందిన అఖిల్ గొగోయి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఉద్యమం చేసి జైలుపాలైన విషయం తెలిసిందే.

అయితే జైలు నుండే అస్సాం శాసనసభ ఎన్నికలకు పోటీ చేసి, శివసాగర్‌లో బీజేపీకి చెందిన తన సమీప ప్రత్యర్థి సురభి రాజ్‌కోన్‌వారిపై 11,875 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడమే విశేషం.

గొగోయి గెలవడంలో ఎలాంటి విశేషం లేదు కానీ, జైలులో ఉండడంతో ప్రచారం కూడా చేయలేక పోయిన ఆయన తరపున ప్రచార బాధ్యతలను గొగోయి తల్లి 85 ఏళ్ల ప్రియాదా గొగోయి నెత్తికెత్తుకున్నారు.

మరోవైపు సామాజిక హక్కుల కార్యకర్త మేధాపాట్కర్, సందీప్ పాండే కూడా ఆమెతో కలిసి చేసిన ప్రచారం వల్ల గొగోయి విజయం సాధించారు.

ఇకపోతే 1977లో జైలు నుంచే లోక్‌సభకు పోటీ చేసిన జార్జిఫెర్నాండెజ్ 3 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.

ఆ తర్వాత ఇప్పటి వరకు రాజకీయ ఖైదీగా ఉంటూ విజయం సాధించింది ఒక్క గొగోయి మాత్రమేనట.ఈ విజయం కక్కూర్తినేతలకు కనువిప్పు కావాలి, ఓటర్లు తలచుకుంటే మిడిసిపడే అవినీతి రాజకీయ పందికొక్కుల బ్రతుకులు ఎలా మారుతాయో ప్రజలను దోచుకు తింటున్న రాబంధులకు అర్ధం కావాలని న్యాయంగా బ్రతుకుతున్న సామాన్యుల ఆవేదనట.

#MotherPriyara #Jailed #Campaigning #Winning #Created History

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు